తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జనాభా కట్టడిపై పిల్​లో కక్షిదారుగా ఆరోగ్య శాఖ - జనాభాపై పిల్​లో కేంద్ర ఆరోగ్య శాఖ

జనాభా కట్టడికి ఇద్దరు సంతానం నిబంధన విధించటం సహా తగిన చర్యలు చేపట్టాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కక్షిదారుగా చేర్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ మేరకు పిటిషన్​దారు పెట్టుకున్న అభ్యర్థనకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది.

SC
జనాభా కట్టడిపై పిల్​లో కక్షిదారుగా ఆరోగ్య శాఖ

By

Published : May 9, 2021, 6:56 AM IST

దేశంలో పెరుగుతున్న జనాభాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్​)లో కక్షిదారుగా కేంద్ర ఆరోగ్య శాఖను చేర్చాలన్న విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు భాజపా నేత, న్యాయవాది అశ్వినీ కుమార్​ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్​ సంజీవ్​ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిల్​లో కేంద్ర హోం శాఖ స్థానంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కక్షిదారుగా చేర్చుతున్నట్లు తెలిపింది.

జనాభా కట్టడిలో ఇద్దరు సంతానం నిబంధన విధించడం సహా తగిన చర్యలు తీసుకోవాలని పిల్​లో పిటిషనర్​ పేర్కొన్నారు. అయితే.. దేశంలో కుటుంబ నియంత్రణను బలవంతంగా చేపట్టలేమని సుప్రీంకోర్టుకు గతంలో కేంద్రం తెలిపింది. అంతకుముందు పిటిషనర్​ ఈ వ్యాజ్యాన్ని దిల్లీ హైకోర్టులో దాఖలు చేయగా.. ఆ న్యాయస్థానం తోసిపుచ్చింది. దాంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఆ చిన్నారులకు అండగా ఉండాలి..

కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో చిన్నారులకు మెరుగైన రక్షణ అందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్​ రవీంద్ర భట్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జువెనైల్ జస్టిస్ జస్టిస్ కమిటీ ఛైర్​పర్సన్​గా ఉన్న ఆయన.. ప్రస్తుత సంక్షోభ సమయంలో చిన్నారుల సంరక్షణపై వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై సమీక్ష నిర్వహించారు. యునిసెఫ్​ సమన్వయంతో ఈ సమావేశం జరిగింది.

కరోనా బారిన పడి తల్లితండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన పరిస్థితులను కొందరు చిన్నారులు ఎదుర్కొంటున్నారని రవీంద్ర భట్​ పేర్కొన్నారు. తమ తల్లితండ్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సమయంలో మరికొంతమంది పిల్లలు నిస్సహాయులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి తగిన సంరక్షణ చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి:'వారం రోజులుగా 180 జిల్లాల్లో కొత్త కరోనా కేసుల్లేవు'

ABOUT THE AUTHOR

...view details