వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలో 'విద్య' అనేది సేవా? కాదా? అనే అంశాన్ని పరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. విద్య అనేది వినియోగదారుల రక్షణ చట్టంలో ఒక సేవా? కాదా? అని ప్రశ్నిస్తూ 2020లో దాఖలైన 'మను సోలంకీ వర్సెస్ వినాయక మిషన్ విశ్వవిద్యాలయం' కేసుతో కలిపి దీనిని విచారించనున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ బి.వి నాగరత్నతో కూడిన ధర్మాసనం తెలిపింది.
విద్యా సంస్థలు అందించే సేవలు.. ముఖ్యంగా పాఠశాలల్లో నిర్వహించే ఈత వంటి కార్యకలాపాలు వినియోగదారుల రక్షణ చట్టం-1986 పరిధిలోకి(సేవల) రావంటూ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పునిచ్చిన నేపథ్యంలో లఖ్‌నవూకు చెందిన ఓ వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ నేపథ్యం..
'సమ్మర్ క్యాంప్'లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. దీనిలో భాగంగా ఈత పోటీలు సైతం ఉంటాయని, రూ.1000 కట్టాలని 2007లో పిటిషనర్ కుమారుడు చదువుతున్న విద్యాసంస్థ సూచించింది.