తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెక్షన్​ 124ఏ రద్దు పిటిషన్​పై ఏజీ సాయం కోరిన సుప్రీం! - దేశద్రోహ చట్టం

ఐపీసీ సెక్షన్ 124ఏ కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్ సహాయం కోరింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ సెక్షన్​ చట్టబద్ధత భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ విశ్రాంత మేజర్ జనరల్ ఎస్​జీ వోంబట్‌కెరె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ipc 124A
ఐపీసీ 124ఏ

By

Published : Jul 14, 2021, 2:50 PM IST

భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ సెక్షన్ 124ఏను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్ సహాయం కోరింది సుప్రీంకోర్టు. ఐపీసీలోని సెక్షన్ 124ఏ కింద రాజద్రోహం కేసులు నమోదుచేస్తుండగా.. ఈ సెక్షన్‌ను రద్దుచేయాలంటూ విశ్రాంత మేజర్ జనరల్ ఎస్​జీ వోంబట్‌కెరె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్​ నకలును అటార్నీ జనరల్‌కు అందజేయాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది. పిటిషన్‌ను పరిశీలించాల్సిందిగా అటార్నీ జనరల్‌ను కోరింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది.

సెక్షన్ 124Aచట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే విచారణ జరుపుతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ సెక్షన్ 124ఏ చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఇద్దరు పాత్రికేయులు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ కేఎమ్​ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేసింది.

ఇదీ చదవండి:మూడో ముప్పువేళ.. ఈ 'కాంవడ్' యాత్ర ఏంటి?

ABOUT THE AUTHOR

...view details