SBIF Asha Scholarship for Poor Students : కొందరు విద్యార్థులకు కావాల్సినంత ప్రతిభ ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా నిలుస్తుంటాయి. పేదరికం కారణంగా.. మట్టిలో మాణిక్యాలెన్నో వెలుగులోకి రాలేకపోతున్నాయి. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన ఫౌండేషన్ ద్వారా ఏడాదికి రూ.10 వేలు స్కాలర్‌షిప్ అందించేందుకు ముందుకొచ్చింది. మరి.. ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హతలేంటి? ఏయే పత్రాలు అవసరం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
SBIF Asha Scholarship 2023 : SBI అందిస్తున్న ఆ స్కాలర్‌షిప్ పేరు.. ఎస్‌బీఐఎఫ్ ఆశా స్కాలర్‌షిప్(SBIF Asha Scholarship). 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందడానికి అర్హులు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా ఈ స్కాలర్‌షిప్‌నకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 30 చివరి తేదీ ఈ లోగా ఆన్‌లైన్‌లో https://www.sbifoundation.in/focus-area-detail/SBIF-Asha-Scholarship వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Eligibility Criteria for SBIF Asha Scholarship :
ఎస్‌బీఐఎఫ్ ఆశా స్కాలర్‌షిప్ అర్హతలు..
- ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌నకు అప్లై చేసుకోవచ్చు.
- దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి.
- అలాగే దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం రూ.3 లక్షలు మించరాదు.
Required Documents for Asha Scholarship :
దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు..
- గత విద్యాసంవత్సరానికి సంబంధించిన మార్కుల మెమో
- ప్రభుత్వ గుర్తింపు కార్డు( ఆధార్, రేషన్ కార్డు వంటివి)
- ప్రస్తుత సంవత్సరంలో అడ్మిషన్‌కు సంబంధించిన ఆధారాలు (ఫీజు రిసీట్, అడ్మిషన్ లెటర్/స్కూల్ ఐడీ కార్డు/బోనఫైడ్ సర్టిఫికెట్ లాంటివి)
- ఆదాయానికి సంబంధించిన ఆధారాలు (ఫామ్ 16ఏ/ఆదాయ ధ్రువీకరణ పత్రం)
- దరఖాస్తుదారు ఫొటో
- బ్యాంకు అకౌంట్ వివరాలు