SBI Recruitment 2022: చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సిస్టమ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ). రెగ్యులర్, కాంట్రాక్టు పద్ధతిలో వీటిని భర్తీ చేయనుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లై చేసేందుకు మే 17 చివరి తేదీ. ఈ పోస్టులకు ఇంజనీరింగ్, సైన్స్‌లో డిగ్రీ లేదా పీజీ కనీస విద్యార్హత. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, సైబర్ సెక్యూరిటీ సంబంధిత విభాగాల్లో పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రాసి ఎంపికైతే ముంబయిలో పోస్టింగ్ ఉంటుంది.
చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగానికి ఒక్కటే పోస్టు ఖాళీగా ఉంది. దీన్ని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. వయోపరిమితి 57 ఏళ్లు. వివిధ పోస్టులు, ఖాళీల వివరాలు ఇప్పుడు చూద్దాం.
- సిస్టమ్ ఆఫీసర్(టెస్ట్ ఇంజినీర్) -2
- సిస్టమ్ ఆఫీసర్(వెబ్ డెవలపర్) -2
- సిస్టమ్ ఆఫీసర్(పెర్మామెన్స్/ సీనియర్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్): 1
- సిస్టమ్ ఆఫీసర్(ప్రాజెక్టు మేనేజర్)-3
- ఎగ్జిక్యూటివ్(ఇంటరాక్షన్ డిజైనర్) -3
- ఎగ్జిక్యూటివ్(వెబ్ డెవలపర్) -1
- ఎగ్జిక్యూటివ్(పోస్టల్ అడ్మినిస్ట్రేటర్)-3
- సీనియర్ ఎగ్జిక్యూటివ్(పర్మార్మెన్స్/ సీనియర్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్)- 4
- సీనియర్ ఎగ్జిక్యూటివ్(ఇంటరాక్షన్ డిజైనర్) -2
- సీనియర్ ఎగ్జిక్యూటివ్(ప్రాజెక్టు మేనేజర్) -4
- సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్(ప్రాజెక్టు మేనేజర్)-1