SBI SCO Recruitment 2023 : ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 439 SCO (స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు కావలసిన విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు.. తదితర పూర్తి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు..
SBI SCO Jobs :
- మొత్తం పోస్టుల సంఖ్య - 439
- ఉద్యోగ స్థాయి - స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్
విద్యార్హతలు..
SBI SCO Qualifications :అభ్యర్థులు 2023 ఏప్రిల్ 30 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి బీఈ/ బీటెక్ లేదా ఎంఈ/ ఎంటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంసీఏ చేసి ఉండాలి. ఇంకా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన పూర్తి విద్యార్హతలు, వయోపరిమితి సడలింపులు వివరాల కోసం ఎస్బీఐ అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు.
అప్లికేషన్ ఫీజు..
SBI SCO Fee :
- జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750/-లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం..
SBI Recruitment Exam Pattern : ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని వివిధ నగరాలలోని పలు పరీక్ష కేంద్రాలలో ఈ నియామక పరీక్ష జరుగుతుంది. అభ్యర్థుల పరీక్ష ఫలితాల ఆధారంగా ఓ షార్ట్‌లిస్ట్‌ను విడుదల చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. షార్ట్‌లిస్ట్‌లోని అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అందులో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తారు.