స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) పరీక్ష అడ్మిట్ కార్డులను (Sbi Po Admit Card 2021) ఎస్బీఐ విడుదల చేసింది. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in నుంచి వీటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 27 వరకు హాల్‌టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందవచ్చు.
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..?
- ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి
- వెబ్సైట్లో పై భాగాన కెరీర్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- డౌన్లోడ్ కాల్ లెటర్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ తర్వాత అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి.