భారతీయ స్టేట్ బ్యాంకులో పనిచేయాలనుకునే వారికి శుభవార్త. 6,100 అప్రెంటిస్ పోస్టులను(bank jobs India) ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 26 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
రాష్ట్రాలవారీగా ఈ నియామక ప్రక్రియ జరగనుంది. అయితే అప్లికేషన్ సమయంలో ఒకే రాష్ట్రాన్ని ఎంచుకునే వీలుంటుంది. రిజిస్ట్రేషన్ సందర్భంగా మూడు జిల్లాలను(bank jobs in Hyderabad) ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
అప్లై చేసుకోవడం ఎలాగంటే...
- ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.inలోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కిందకు స్క్రోల్ చేసి... కెరీర్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి
- కొత్త పేజీలో తాజా ప్రకటనల విభాగం ఉంటుంది. అందులో Engagement of Apprentices Under The Apprentices Act, 1961 అనే ప్రకటన పక్కన ఉండే అప్లై ఆన్లైన్ బటన్ను క్లిక్ చేయాలి.
- మరో పేజీ ఓపెన్ అయిన తర్వాత 'నూతన రిజిస్ట్రేషన్' ఆప్షన్ను ఎంచుకోవాలి.
- అందులో వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలన్నీ నమోదు చేయాలి. అనంతరం సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి.
- అప్రెంటిస్షిప్ దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి.
జులై 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 6 నుంచి 26 మధ్య పరీక్షా రుసుం చెల్లించే వీలుంది. అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆగస్టు 10 వరకు అవకాశం ఉంటుంది.