SBI Junior Associate Recruitment 2023 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8773 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తికలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విద్యార్హతలు, ఏజ్ లిమిట్, జీతభత్యాలు తదితర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మొత్తం పోస్టుల సంఖ్య : 8,773 (రెగ్యులర్, బ్యాక్లాగ్)
ఉద్యోగాలు : జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్)
విద్యార్హతలు
- అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
వయోపరిమితి
- 2023 ఏప్రిల్ 1 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
- రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు
- ప్రారంభ వేతనం రూ.19,900 వరకు ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులకు 6 మాసాల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్ మెన్, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు.
- ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కోసం అభ్యర్థలు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం
- రెండు దశల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
- ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
- మెయిన్ పరీక్ష 200 మర్కులకు ఉంటుంది
- సమయం 1 గంట
- నెగిటివ్ మార్క్‌లు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి 1/4 మార్క్ కట్ చేస్తారు.