SBI Jobs 2023 : ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగిగా స్థిరపడాలని కలలు కనేవారికి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107 పోస్టుల భర్తీ చేసేందుకు ప్రకటనను విడుదల చేసింది. అసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ రోజు (సెప్టెంబర్ 6) నుంచే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ( SBI Recruitment 2023 )
మొత్తం ఖాళీలు!
SBI Vacancy 2023 :107 పోస్టులు
ఈ పోస్టులు!
- కంట్రోల్ రూమ్ ఆపరేటర్ పోస్టులు (క్లరికల్ కేడర్) - 89
- ఆర్మరర్స్ పోస్టులు - 18
ఏజ్ లిమిట్!
SBI Jobs 2023 Age Limit :
- ఆర్మరర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 20 ఏళ్లు, గరిష్ఠంగా 45 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- కంట్రోల్ రూమ్ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే ఆశావాహుల వయస్సు కనిష్ఠంగా 20 ఏళ్లు, గరిష్ఠంగా 48 ఏళ్లు ఉండాలి.
- స్టేట్ ఫైర్ విభాగంలో పని చేసిన ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 35 ఏళ్లు లోపు ఉండాలి.
వీరు మాత్రమే అర్హులు!
SBI Jobs 2023 Qualification :
- ఆర్మరర్స్(ఎక్స్-సర్వీస్‌మెన్)కి చెందిన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అంటే మిలిటరీ లేదా పోలీస్ ఫోర్స్‌లోని ఆర్మరర్స్ విభాగంలో పని చేసి రిటైర్ అయిన ఉద్యోగుల పిల్లలు మాత్రమే అప్లై చేసుకోవాలి.
- ఇక కంట్రోల్ రూమ్ ఆపరేటర్ పోస్టుల కోసం రాష్ట్ర అగ్నిమాపక శాఖలో సేవలు అందించి రిటైర్ అయిన ఎక్స్-సర్వీస్‌మెన్, అలాగే ఆర్మరర్స్ కుటుంబానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.