SBI JOBS 2023 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ.. అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ ( SBI Apprentice Recruitment 2023 ) విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఏకంగా 6160 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 21లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు
SBI Apprentice Jobs :
- ఎస్సీ - 989 పోస్టులు
- ఎస్టీ - 514 పోస్టులు
- ఓబీసీ - 1389 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 603 పోస్టులు
- యూఆర్ - 2665 పోస్టులు
నోట్ : ఆంధ్రప్రదేశ్‌లో 390 అప్రెంటీస్ పోస్టులు, తెలంగాణలో 125 పోస్టులు భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు
SBI Apprentice Eligibility :అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
SBI Apprentice Age Limit :అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ఆయా కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
SBI Apprentice Application Fee :
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.300 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
శిక్షణ వ్యవధి
SBI Apprentice Training Period :ఎస్బీఐ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
స్పైపెండ్
SBI Apprentice Stipend : అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 చొప్పున స్టైపెండ్ అందిస్తారు.
ఎంపిక ప్రక్రియ
SBI Apprentice Selection Process :అభ్యర్థులకు ఆన్లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల.. ధ్రువపత్రాలను పరిశీలన చేస్తారు. తరువాత వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
SBI Apprentice Exam Pattern :పరీక్ష పత్రంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్క్ చొప్పున ఉంటుంది. ఈ పరీక్ష వ్యవధి కేవలం 60 నిమిషాలు మాత్రమే. పరీక్ష పత్రం ఇంగ్లీష్, హిందీ భాషలతో సహా 13 భాషలలో ఉంటుంది. ముఖ్యంగా తెలుగు భాషలోనూ పరీక్ష పత్రం అందుబాటులో ఉంటుంది.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ఎలా?
SBI Apprentice Online Application Process :
- అభ్యర్థులు ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ https://sbi.co.in/ ను ఓపెన్ చేయాలి.
- వెబ్‌సైట్‌లోని Recruitment లేదా Careers సెక్షన్‌ను ఓపెన్ చేయాలి.
- మీకు కెరీర్ సెక్షన్లో Apprentice Recruitment 2023 కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేయాలి.
- ముందుగా మీరు అప్రెంటీస్ నోటిఫికేషన్‌లోని వివరాలు అన్నింటినీ క్షుణ్ణంగా చదువుకోవాలి. తరువాత..
- Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
- మీ విద్యార్హత పత్రాలు, ఫొటో, సంతకాలను.. స్కాన్ చేసి, వాటిని అప్లోడ్ చేయాలి. తరువాత..
- దరఖాస్తు రుసుమును ఆన్లైన్లో చెల్లించాలి.
- మరోసారి అప్లికేషన్‌లోని వివరాలు అన్నింటినీ చెక్‌చేసుకుని, సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ డౌన్లోడ్ చేసుకోవడం మంచిది.
ముఖ్యమైన తేదీలు
SBI Apprentice Recruitment Important Dates :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్ 1
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్ 21
- అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి చివరి తేదీ : 2023 అక్టోబర్ 06
- ఆన్లైన్ పరీక్షలు జరిగే తేదీలు : 2023 అక్టోబర్/ నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.