భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) ఛానల్ మేనేజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్టులు ఆహ్వానిస్తోంది. ఈ విభాగంలో 642 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించేందుకు జూన్ 7 చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు sbi.co.in వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎస్బీఐలో విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయిన అభ్యర్థులు అర్హులు.
ఖాళీల వివరాలు:
- ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్-ఎనీటైమ్ ఛానల్స్ (సీఎంఎస్-ఏసీ): 503 పోస్టులు
- ఛానల్ మేనేజర్ సూపర్వైజర్-ఎనీటైమ్ ఛానల్స్(సీఎంఎస్-ఏసీ): 130 పోస్టులు
- సపోర్ట్ ఆఫీసర్-ఎనీటైమ్ ఛానల్స్(ఎస్ఓ-ఏసీ): 8 పోస్టులు