తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చనిపోయిన రైతుకు లోన్​.. డబ్బులివ్వకుండానే రుణం కట్టాలంటూ నోటీసులు - 3 క్రితం మరణించిన రైతుకు లోన్​

మూడేళ్ల క్రితం మరణించిన వ్యక్తికి రుణాన్ని మంజూరు చేశారు బ్యాంక్ అధికారులు. రుణ నగదు అందించకుండానే.. తిరిగి లోన్​ చెల్లించాలంటూ అతడి కుటుంబ సభ్యులకు నోటీసులు పంపారు.

bank issues loan to dead farmer
bank issues loan to dead farmer

By

Published : Mar 30, 2023, 10:13 AM IST

మధ్యప్రదేశ్​ ఛింద్​వాఢలో వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి మరణించిన మూడేళ్ల తర్వాత.. అతడికి లోన్​ మంజూరు చేశారు బ్యాంక్​ అధికారులు. తాజాగా లోన్​ తిరిగి చెల్లించడం లేదంటూ మృతుడి కుటుంబ సభ్యులకు నోటీసులు అందించారు. అయితే, తమకు బ్యాంక్​ నుంచి ఎలాంటి రుణం అందలేదని మృతుడి కుమారుడు వాపోతున్నాడు.

చౌరాయ్​ తాలుకాలోని తూన్​వాఢ గ్రామానికి చెందిన అజబ్​ సింగ్​ వర్మ అనే రైతు 2006లో లోన్​ కోసం స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛింద్​వాఢ శాఖలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే అతడు మరణించాడు. అందరూ లోన్​ గురించి మరిచిపోయిన మూడేళ్ల తర్వాత అతడి పేరుపై రుణాన్ని మంజూరు చేసింది ఎస్​బీఐ. అయితే, 2018లో కమల్​నాథ్​ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక.. రైతులకు రూ. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. దీంతో బ్యాంక్ అధికారులు అజబ్ కుటుంబ సభ్యులకు లేఖ రాశారు.

ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఇక్కడే అడ్డం తిరిగింది. రుణాన్ని మాఫీ చేస్తే సంతోషించాల్సిన కుటుంబ సభ్యులు షాక్​కు గురయ్యారు. అప్పటి వరకు అజబ్​ కుటుంబ సభ్యులకు లోన్​ మంజూరైన విషయం తెలియదు. తమకు ఎలాంటి నగదు చెల్లించకుండానే.. రుణమాఫీ చేసినట్లు నోటీసులు ఎలా ఇచ్చారని ఆశ్యర్యం వ్యక్తం చేశారు. మరోవైపు రుణమాఫీ చేస్తున్నట్లు నోటీసులు పంపిన బ్యాంక్ అధికారులు ప్లేట్ మార్చారు. రూ. 2,75,000 తిరిగి చెల్లించాల్సిందేనంటూ అజబ్​ కుటుంబానికి మరోసారి నోటీసులు పంపించారు. లోన్​ కట్టాలంటూ తమను వేధిస్తున్నారని మృతుడి కుమారుడు శంబూ ఆవేదన వ్యక్తం చేశాడు.

"మా నాన్న ఓ రైతు. ఆయన 2006లో వ్యవసాయ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అదే సంవత్సరం మా నాన్న చనిపోయారు. 2009లో బ్యాంక్​ మాకు లోన్​ మంజూరు చేసినట్లు నోటీసులు పంపింది. మేము తీసుకోని రుణానికి మమ్మల్ని కట్టాలంటూ.. అనేక సార్లు వేధించారు. అసలు మేము బ్యాంకు నంచి ఎలాంటి రుణం పొందలేదు. ఈ ఫేక్​ లోన్​ కేసు వల్ల మాకు ఏ బ్యాంక్ కూడా రుణాన్ని మంజూరు చేయడం లేదు."

--శంబూ, అజబ్​ కుమారుడు

బ్యాంక్ అధికారుల చర్యలతో విసిగిపోయిన అజబ్​ కుమారుడు శంబూ.. కలెక్టర్​ను ఆశ్రయించాడు. తీసుకోని రుణాన్ని చెల్లించాలంటూ.. బ్యాంక్​ అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు.

ఇవీ చదవండి :'సర్​ప్రైజ్ ఇస్తా.. కళ్లు మూసుకో' అని కత్తితో పొడిచి హత్య.. శవాన్ని ముక్కలు చేసి..

ప్రియుడితో పారిపోయేందుకు ప్లాన్​.. తనలా ఉన్న మరో అమ్మాయిని చంపి ఎస్కేప్​

ABOUT THE AUTHOR

...view details