తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్యాంక్​ క్లర్క్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్- వీరే అర్హులు..

వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది ఐబీపీఎస్​. అప్లై చేసే విధానం, పరీక్ష తేదీ, ఇతర వివరాలు మీకోసం...

ibps notification
క్లర్క్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​.. వీరే అర్హులు..

By

Published : Jul 13, 2021, 6:35 PM IST

ఉద్యోగ అవకాశాల కోసం నిరీక్షిస్తున్న వారికి శుభవార్త. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది ఐబీపీఎస్​ (ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సెనల్​ సెలక్షన్​). మొత్తం 5,830 పోస్టులకు ఈ ఏడాది పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు రుసుము రూ.850 కాగా.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.175.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: జులై 12
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 1
  • దరఖాస్తులు ఎడిట్​ చేసుకోవడానికి చివరి తేదీ: ఆగస్టు 1
  • ప్రాథమిక పరీక్ష: ఆగస్టు 28-29, సెప్టెంబర్​ 4
  • ఫలితాలు: 2021 సెప్టెంబర్
  • మెయిన్స్​ పరీక్షలు: 2021 అక్టోబర్​ 31
  • ఫలితాలు: 2022 ఏప్రిల్​ 1
  • దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్​సైట్​: ibps.in

అర్హత..

2021 జులై 21 నాటికి 20ఏళ్ల నుంచి 28ఏళ్లలోపు ఉండేవారు ఈ పరీక్షకు అర్హులు. అంటే.. 1993 జులై 2 నుంచి 2001 జులై 1 మధ్య జన్మించినవారే అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పాస్ అవ్వాలి.

ఇతర వివరాలు..

బ్యాంక్​ ఆఫ్​ బరోడా, బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్​, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఇండియన్​ బ్యాంక్​, ఇండియన్​ ఓవర్​సీస్​ బ్యాంక్​, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంక్​, యూకో బ్యాంక్​, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాల్లో క్లర్క్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది ఐబీపీఎస్​.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్​ పోస్టుల భర్తీ ప్రక్రియ రాష్ట్రాలు- కేంద్ర పాలిత ప్రాంతాల ఆధారంగా ఉంటుంది. అందువల్ల దరఖాస్తు చేసుకునే వారు కేవలం ఒకటే రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న చోటే ఆన్​లైన్​ పరీక్ష ఉంటుంది.
ఎస్​సీ, ఎస్​టీ, ఎక్స్​-సర్వీస్​మెన్​, మైనారిటీలకు.. పరీక్షల కోసం శిక్షణా తరగతులను సైతం ఏర్పాటు చేశారు. ఆగస్టు 16న శిక్షణ ప్రారంభమవుతుంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

  • ibps.in వెబ్​సైట్​లోకి వెళ్లాలి
  • ఐబీపీఎస్​ క్లర్క్​ ఎగ్జామ్​ నోటిఫికేషన్​ను క్లిక్​ చేయాలి
  • న్యూ రిజిస్ట్రేషన్​ లింక్​ మీద క్లిక్​ చేయాలి
  • సాధారణ వివరాలు నమోదు చేసుకుని ఐడీ, పాస్​వర్డ్​ పొందాలి
  • ఐడీ, పాస్​వర్డ్​తో లాగిన్​ అవ్వాలి
  • అప్లికేషన్​ ఫామ్​ను నింపాలి
  • సంబంధిత పత్రాలను అప్లోడ్​ చేయాలి
  • అప్లికేషన్​ రుసుమును చెల్లించి, ఆ రసీదు డౌన్​లోడ్​ చేసుకోవాలి
  • అప్లికేషన్​ ఫామ్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details