SBI Clerk Job Vacancy 2023 : ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో కొలువు సాధించాలని ఎదురుచూస్తున్న ఆశావాహులకు శుభవార్త వినిపించింది ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). మొత్తం 5000 పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. అయితే దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరితేదీ, పరీక్ష తేదీలు సహా ఇతర ముఖ్యమైన వివరాలను ఇంకా వెల్లడించనప్పటికీ ఈ నెలలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, అర్హత కలిగిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ www.sbi.co.inను చూడవచ్చు.
మొత్తం ఖాళీలు!
SBI Clerk Jobs 2023 : జూనియర్ అసోసియేట్(కస్టమర్ సపోర్ట్), సేల్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 5000పోస్టులను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.
వయోపరిమితులు!
SBI Clerk 2023 Age Limit :ఎస్బీఐ క్లర్క్ 2023 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు కనిష్ఠంగా 20, గరిష్ఠంగా 28 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు ఉంటాయి.
విద్యార్హతలు!
SBI Clerk 2023 Eligibility : డిగ్రీ పూర్తి చేసిన ప్రతిఒక్కరూ ఎస్బీఐ విడుదల చేయనున్న ఈ భారీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము!
వివిధ కేటగిరీలకు సంబంధించి దరఖాస్తు రుసుము వివరాలు ఇలా ఉన్నాయి.
- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు- రూ.750/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. పూర్తిగా ఉచితం.
పరీక్షా సిలబస్!