SBI CBO Jobs 2023 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5280 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ బ్యాంకింగ్జాబ్స్పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ https://sbi.co.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- మొత్తం ఉద్యోగాలు - 5280
- హైదరాబాద్ సర్కిల్లోని ఉద్యోగాలు - 425
- అమరావతి సర్కిల్లోని ఉద్యోగాలు - 400
విద్యార్హతలు
SBI CBO Qualifications :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు అర్హులు.
- కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ డిగ్రీ (IDD) చేసినవారు కూడా ఈ పోస్టులకు అర్హులే.
- మెడికల్, ఇంజినీరింగ్, ఛార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ చేసిన అభ్యర్థులు కూడా CBO ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి
SBI CBO Age Limit :
- అభ్యర్థులు 1993 నవంబర్ 1 తరువాత - 2002 అక్టోబర్ 31లోపు జన్మించి ఉండాలి. అంటే అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 21 ఏళ్లు, గరిష్ఠంగా 30లోపు ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి మినహాయింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు
SBI CBO Application Fee :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.