2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో(Gujarat Riots) అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి(Narendra Modi Gujarat Riots) ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్‌చిట్(Sit Clean Chit To Modi) ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దివంగత నేత ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 26న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. ఈ కేసులో(Gujarat Riots) మరిన్ని వాయిదాలు కోరేందుకు పిటిషన్‌దారును అనుమతించబోమని స్పష్టం చేసింది. కేసుకు నంబంధించి అదనపు పత్రాలు సమర్పించేందుకు మాత్రం అనుమతి మంజూరు చేసింది.
అంతకుముందు, జాకియా తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ మోదీకి క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ తాము దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం ఆకస్మికంగా విచారణకు వచ్చిందని పేర్కొన్నారు. దానిపై శుక్రవారమే తమకు సమాచారం అందిందన్నారు. దాదాపు 23 వేల పేజీల వరకు దస్త్రాలు ఉండటంతో వాటిని సమీకరించేందుకు వీలుగా విచారణను నిర్దిష్ట తేదీకి వాయిదా వేయాలని విన్నవించారు.