తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిందువును ముస్లిం అనుకొని ఖననం! - జెడ్డాలోని భారత దౌత్యకార్యాలయం

హిందువును ముస్లిం అనుకొని ఖననం చేశారు సౌదీ అధికారులు. అయితే.. ఆ వ్యక్తి అస్థికలను భారత్​కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం దిల్లీ హైకోర్టుకు తెలిపింది.

delhi HC, centre to HC
దిల్లీ హైకోర్టు, సౌదీ ప్రభుత్వం

By

Published : Apr 16, 2021, 7:17 AM IST

ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఖననం చేసిన హిందూ వ్యక్తి సమాధిని సౌదీ అరేబియా ప్రభుత్వం గుర్తించిందని, మృతుడి అస్థికలను భారత్ రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం గురువారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది.

ఇదీ జరిగింది...

ఈ ఏడాది జనవరి 24న సౌదీలో భారత్​కు చెందిన సంజీవ్ కుమార్(51) గుండెపోటుతో మరణించారు. జెడ్డాలోని భారత దౌత్య కార్యాలయంలోని అనువాదకుడు పొరపాటున మరణ ధ్రువీకరణ పత్రంలో సంజీవ్​ను ముస్లిం వ్యక్తిగా పేర్కొనడంతో అక్కడి అధికారులు ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు. విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన భారత దౌత్యాధికారులు మృతుడి భార్య అంజూ శర్మకు విషయాన్ని వివరించి క్షమాపణ కోరారు. ఆ సమయంలోనే తన భర్త అస్థికలను భారత్​కు పంపాలని ఆమె అధికారులను కోరారు. వారు స్పందించకపోవడంతో ఆమె మార్చిలో దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సమాధిని గుర్తించామని, అస్థికల కోసం సౌదీలో చట్టపరమైన చర్యలు ప్రారంభించామని గురువారం భారత విదేశాంగ శాఖ అధికారులు.. న్యాయస్థానానికి తెలిపారు.

ఇదీ చదవండి:విజయన్​పై మురళీధరన్​ ఘాటు వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details