అన్నదాతలు చేపట్టిన భారత్ బంద్కు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సత్యాగ్రహం (శాంతియుత ఉద్యమం).. దురాగతాలు, అన్యాయాలు, అహంకారాన్ని అంతం చేస్తుందని భారత చరిత్ర చెబుతోందంటూ ట్వీట్ చేశారు. ఆయన.. రైతులు ఉద్యమం కూడా అలానే కొనసాగాలని ఆకాంక్షించారు. ఆందోళనలు దేశ ప్రయోజనాల కోసం, శాంతియుతంగా ఉండాలని సూచించారు.
'సత్యాగ్రహంతోనే అన్యాయం, అహంకారం అంతం' - Minimum Support Price
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్కు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. 'సత్యాగ్రహం'తోనే.. దురాగతాలు, అన్యాయం, అహంకారం అంతమవుతాయని దేశ చరిత్ర చెబుతోందని ట్వీట్ చేశారు.
'కేంద్రం దురాగతాలను అంతం చేసేలా భారత్ బంద్'
దిల్లీ సరిహద్దుల్లోని సింఘూ, గాజీపుర్, టిక్రీ ప్రాంతాల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు నిరసలు చేపట్టి నేటికి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సంపూర్ణ బంద్ పాటించి ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు.