తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసులకు పట్టించిందని మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పిన దొంగ! - మధ్యప్రదేశ్ లేటేస్ట్ న్యూస్

మహిళను వివస్త్రను చేసి నగ్నంగా ఊరంతా తిప్పాడు ఓ 'దొంగ'. ఈ దుశ్చర్యను ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు గ్రామస్థులు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్​లోని సత్​నాలో జరిగింది. కేరళలో జరిగిన మరో ఘటనలో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.

woman beaten up and half naked in Satna
woman beaten up and half naked in Satna

By

Published : Oct 10, 2022, 1:34 PM IST

మధ్యప్రదేశ్​ సత్​నాలో అమానవీయ ఘటన జరిగింది. మహిళను నగ్నంగా చేసి గ్రామమంతా తిప్పాడు ఓ వ్యక్తి. తనను పోలీసులకు అప్పగించిందని ఆగ్రహించిన 'దొంగ'.. విడుదల కాగానే మహిళ ఇంటికి వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

బాధితురాలు తన భర్తతో కలిసి మైహర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని నివసిస్తోంది. కొన్ని రోజుల కింద నలుగురు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. దొంగతనం చేస్తుండగా నిద్రిస్తున్న భార్యాభర్తలు లేచారు. భయపడిన నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించారు. వీరిలో ముగ్గురు పారిపోగా.. రితేశ్ రాజ్​ అనే నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు భార్యాభర్తలు. జైలు పాలైన నిందితుడు ఇటీవల విడుదలయ్యాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి బాధితురాలికి ఇంటికి చేరుకున్న నిందితుడు.. ఆమెపై విచక్షణరహితంగా దాడి చేశాడు. ఆమె బట్టలు విప్పి నగ్నంగా గ్రామంలో తిప్పాడు. ఈ దుశ్చర్యను గ్రామస్థులు ప్రేక్షకుల్లా చూస్తూ నిల్చుండిపోయారు. తాను ప్రాధేయపడినా ఎవరు రక్షించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం పోలీస్​ స్టేషన్​కు చేరుకుని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

భార్యను గొంతు నులిపి చంపి.. ఆపై తాను ఆత్మహత్య : భార్యను హత్య చేసి.. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళ కొట్టాయంలో జరిగింది. అయార్​కున్నంకు చెందిన సునీల్​ కుమార్​(50) అతడి భార్య మంజుల(48) ఇంట్లో శవాలుగా కనిపించారు. మొదట భార్య గొంతునులిపి హత్య చేసిన అనంతరం.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సునీల్​.

సోమవారం ఇంటికి వచ్చిన బంధువు తలుపు కొట్టగా ఎవరూ తీయలేదు. అనుమానం వచ్చి చూడగా.. ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన బంధువు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా వీరి మరణానికి గల కారణాలు శవపరీక్ష అనంతరమే తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:యూపీపై వరుణుడి పంజా.. 25 మంది బలి.. 12 జిల్లాల్లో స్కూల్స్​ బంద్

కూతుర్ని గొలుసుతో బంధించిన తండ్రి.. 36 ఏళ్లుగా కిటికీలోంచే భోజనం, స్నానం.. చివరకు..

ABOUT THE AUTHOR

...view details