మధ్యప్రదేశ్ సత్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైహర్ (Maihar road accident) ఠాణా పరిధిలోని జీత్నగర్ వద్ద ఓ కారును వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
మృతుల్ని సత్యం ఉపాధ్యాయ్(40), మనికా ఉపాధ్యాయ్(35), ఇషానీ ఉపాధ్యాయ్(10), స్నేహ్ ఉపాధ్యాయ్గా (8) గుర్తించారు.
వైద్యం అందక బాలుడు..
రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం (Road accident news) జరిగినట్లు తెలుస్తోంది. భార్యాభర్తలు, వారి కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కుమారుడిని స్థానికులు సత్నా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ సమయంలో డాక్టర్ లేకపోవడం వల్ల పిల్లాడికి వైద్యం అందలేదు. 3 గంటల సేపు కొట్టుమిట్టాడి ప్రాణాలు విడిచాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే.. బాలుడు చనిపోయాడని మృతుల బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
మైహర్ రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:ప్రేమించిందని.. కోడలిని కడతేర్చిన మేనమామలు