తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువతిని బంధించి 12 రోజులుగా రేప్.. అబార్షన్​ మాత్రలు వేసుకొని మహిళ మృతి

దాబాకు వెళ్లిన ఓ యువతిపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు అక్కడి సిబ్బంది. మరోవైపు, అబార్షన్​ మాత్రలు వేసుకున్న ఓ మహిళ మృతి చెందిన ఘటన బెంగళూరులో జరిగింది.

rape
rape

By

Published : Dec 15, 2022, 12:09 PM IST

రొట్టె కోసం దాబాకు వచ్చిన ఓ యువతిని బంధించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. దాదాపు 12 రోజులు ఆమెను వేధించి అదే దాబాలో బందీగా ఉంచారు. ప్రతిరోజూ ఆమెపై అత్యాచారం చేశారు. నిందితుల బారి నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్​ సత్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఏం జరిగిందంటే:
జిల్లాలోని నాదాన్​ దేహాత్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ 26 ఏళ్ల యువతి.. గొడవల కారణంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత తన సోదరి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. మార్గమధ్యలో ఆకలి వేసిందని అక్కడే ఉన్న ఓ దాబాలోకి వెళ్లింది. అక్కడున్న వారిని రొట్టె ముక్క కోసం అడగగా ఇదే అదునుగా చేసుకున్న దాబా సిబ్బంది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 12 రోజుల పాటు ఆమెను బందీగా చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, నిందితుల చెర నుంచి ఆమె ఎట్టకేలకు తప్పించుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దాబా యజమాని, సిబ్బందిని అరెస్టు చేశారు.

రౌడీ షీటర్​ దారుణ హత్య..
మధ్యప్రదేశ్​లోని బిలాస్​పుర్​లో ఓ రౌడీ షీటర్​ దారుణ హత్యకు గురయ్యాడు. అతని కారుపై ఉన్న స్టికర్​ ఆధారంగా మొదట ఇతన్ని కాంగ్రెస్​ నేత అని అనుమానించగా ఆ తర్వాత ఇతను రౌడీ షీటర్​ అని స్పష్టమయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం సంజూ త్రిపాఠి అనే వ్యక్తి బుధవారం సాయంత్రం సుమారు 4.15 సమయంలో తన కారులో సక్రిలోని పెండ్రిడి బైపాస్​పై వెళ్తున్నాడు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగులు సంజూపై కాల్పులు ప్రారంభించారు. ఎనిమిది సార్లు కాల్పులు జరపగా సంజూ అక్కడికక్కడే మృతి చెందాడు.

అయితే అతన్ని మొదట కాంగ్రెస్​ నేత అనుకున్నారు. కానీ అతను ఒకప్పుడు యూత్ కాంగ్రెస్‌లో చురుకుగా ఉండేవాడని ప్రస్తుతం అతనికి పార్టీలో ఎలాంటి పదవి లేదని బిలాస్‌పూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విజయ్ కేశర్వాణి పేర్కొన్నారు. విచారణలో అతను ఓ రౌడీ షీటర్​ అని ఇప్పటికే అతనిపై 27 క్రిమినల్ కేసులు పెండింగ్​లో ఉన్నాయని తేలింది. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు.. జిల్లాలో కర్ఫ్యూ విధించారు.

నీటి ట్యాంక్​లో పడి చిన్నారులు మృతి..
నీటి ట్యాంక్​పై కూర్చుని ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు ట్యాంక్​లో పడి మృతి చెందిన ఒడిశాలో జరిగింది. సోద్రలోని చుట్టాల ఇంటికి వచ్చిన ఆ చిన్నారులు ట్యాంక్​పై ఆడుకుంటున్నారు. అదే సమయంలో ట్యాంక్​పైనున్న బండ విరిగిపోవడంతో పిల్లలు నీటిలో పడ్డారు. కాసేపటికి కుటుంబసభ్యులు వారిని వెతకగా చిన్నారులు ట్యాంక్​లో కనిపించారు. దీంతో హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించగా.. చిన్నారులు అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు.

అబార్షన్​ మాత్రలు వేసుకున్న మహిళ మృతి..
అబార్షన్ మాత్ర తీసుకోవడం వల్ల బెంగళురులోని ఓ 33 ఏళ్ల మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. మృతురాలు ఓ ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రీతి కుష్వాగా గుర్తించారు.

పోలీసులు వివరాల ప్రకారం.. డిసెంబరు 10న ప్రీతికి వైద్య పరీక్షలు చేయగా ఆమె గర్భవతి అని నిర్ధరణయ్యింది. అప్పటికే మొదటి బిడ్డ ఇంకా చిన్నారిగా ఉన్నందున ఆ మహిళ గర్భాన్ని కొనసాగించకూడదని నిర్ణయించుకుంది. దీంతో అబార్షన్ మాత్రలు కావాలని భర్తను కోరగా అతడు నిరాకరించాడు. దీంతో సోమవారం రాత్రి అతను వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ప్రీతి అబార్షన్​ మాత్రలు వేసుకుంది. దీంతో మంగళవారం అపస్మారక స్థితిలోకి ఉన్న ప్రీతిని ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

'అప్పట్లో నెహ్రూ 100 మంది ప్రసంగం విన్నారు.. అలాంటి చర్చ అవసరం'

నగలు తాకట్టుపెట్టి ఊరికి ఉపకారం.. సొంతంగా వంతెన, రోడ్డు నిర్మించిన తండ్రీకొడుకులు

ABOUT THE AUTHOR

...view details