తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర, కర్ణాటకలో పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారి కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు కాగా.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టాయి. మహారాష్ట్రలో కొత్తగా 12 వేలకుపైగా కేసులు బయటపడగా.. కన్నడ నాట 11 వేలకుపైగా వెలుగుచూశాయి.

Sates covid-19 cases
రాష్ట్రాల్లో కరోనా కేసులు

By

Published : Jun 10, 2021, 10:48 PM IST

తమిళనాడులో రోజువారి కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. ఒక్కరోజే 16,813 కేసులు బయటపడ్డాయి. మరో 358 మంది కొవిడ్​ బలయ్యారు. తాజాగా 32,049మంది కోలుకున్నారు. దీంతో యాక్టివ్​ కేసుల సంఖ్య 2 లక్షలకు దిగువకు చేరింది.

కేరళలో రోజువారి కొవిడ్​ కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 14,424 మందికి వైరస్​ సోకినట్లు తేలగా.. మరో 194 మంది కొవిడ్ బలయ్యారు.

మళ్లీ పెరిగిన కేసులు

మహారాష్ట్రలో రోజువారి కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 12,207 మందికి కొవిడ్​ సోకింది. మరో 393 మంది మరణించారు.

కర్ణాటకలోనూ కరోనా కేసులు కాస్త పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్కరోజే 11,042 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. కొవిడ్​​ ధాటికి మరో 194 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • పంజాబ్​లో కొత్తగా 1,333 మంది వైరస్​ బారిన పడగా.. మరో 71 మంది చనిపోయారు.
  • జమ్ముకశ్మీర్​లో మరో 1,117 కేసులు వెలుగు చూశాయి. మరో 25 మంది కరోనాకు బలయ్యారు.
  • మధ్యప్రదేశ్​లో తాజాగా 420 మంది వైరస్ సోకగా.. మరో 34 మంది చనిపోయారు.
  • దేశ రాజధాని దిల్లీలో మరో 305 మందికి పాజిటివ్​గా తేలగా.. మరో 44 మంది మృతి చెందారు.
  • రాజస్థాన్​లో తాజాగా 538 కేసులు బయటపడ్డాయి. మరో 23 మంది మరణించారు.

ABOUT THE AUTHOR

...view details