అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని బెంగళూరు ఆసుపత్రిలో కరోనాకు చికిత్స చేయించుకున్న అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రిలో 11 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె... 3 రోజులుగా వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. డిశ్చార్జ్ అయిన తర్వాత క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
శశికళ డిశ్చార్జ్ సందర్భంగా ఆసుపత్రికి అభిమానులు భారీగా చేరుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.