తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సర్పంచ్ దారుణ హత్య.. మృతదేహంతో రోడ్డుపై స్థానికుల ఆందోళన

Sarpanch beaten to death: ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరించిన కారణంగా కక్షపెంచుకున్న కొందరు వ్యక్తులు.. సర్పంచ్​పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. ఆందోళనకు దిగారు.

Sarpanch killed in janjgir
Sarpanch killed in chattisgarh

By

Published : Dec 13, 2021, 7:33 AM IST

Sarpanch beaten to death: ఛత్తీస్​గఢ్​లో దారుణం జరిగింది. జాంజ్​గీర్​లోని భుతాహా గ్రామంలో సర్పంచ్​పై దాడి చేసి చంపారు. గ్రామానికి చెందిన పలువురు కబ్జాదారులే సర్పంచ్​ను హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన తర్వాత నిందితులంతా పారిపోయారు.

రహదారిపై సర్పంచ్ మృతదేహం
విలపిస్తున్న బంధువులు

Chattisgarh Sarpanch killed

స్థానిక సర్పంచ్ ద్వారకప్రసాద్ చంద్ర.. కొందరు ఆక్రమణదారులకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించారు. కబ్జా స్థలాల్లో పంటలు పండించకుండా చర్యలు తీసుకున్నారు. ఇదే హత్యకు కారణమని తెలుస్తోంది. 10-15 మంది కర్రలతో వచ్చి సర్పంచ్​పై దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ ద్వారకప్రసాద్​ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు.

రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు
.

Janjgir Sarpanch death protest

హత్యకు వ్యతిరేకంగా స్థానికులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సర్పంచ్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. తహసీల్దార్ మల్కారోడా సహా 112 సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సర్పంచ్ మరణించారని ఆరోపిస్తున్నారు. పరిస్థితిని అదుపుచేసేందుకు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఆందోళనకారులు మాత్రం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. నిందితులను అరెస్టు చేసేంతవరకు కదిలేది లేదని చెబుతున్నారు.

నిరసన ప్రాంతంలో పోలీసులు

ఇదీ చదవండి:'నేరస్థుడి మానసిక స్థితినీ చూసి శిక్ష విధించాలి'

ABOUT THE AUTHOR

...view details