గుజరాత్ మొతేరాలోని ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టేడియం పేరును మార్చారు. ప్రధాన మంత్రి పేరు మీదగా.. నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు.
ఈ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రారంభించారు. అంతకు ముందు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఎన్క్లేవ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు రాష్ట్రపతి దంపతులు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితీశ్ పటేల్ హాజరయ్యారు.