తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరయూ నదిలో కొవిడ్ మృతదేహాలు!

కరోనా వల్ల మృతి చెందిన వారివిగా భావిస్తున్న మృతదేహాలు ఉత్తరాఖండ్​లోని సరయూ నదిలో బయటపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. ఆ నీటి వల్ల కరోనా వ్యాపిస్తుందేమోనని ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.

Sarayu river
సరయూ నదిలో కొవిడ్ మృతదేహాలు!?

By

Published : May 27, 2021, 3:03 PM IST

ఉత్తరాఖండ్​ పిథౌరీగఢ్​లోని సరయూ నదిలో మృతదేహాలు(dead bodies in Sarayu river) కనిపించడం కలకలం రేపింది. అవి కరోనా రోగుల మృతదేహాలని అనుమానిస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

నదిలోని నీరు కలుషితమై కరోనా వ్యాప్తికి కారణమవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిథౌరీగఢ్ పట్టణానికి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నది నుంచే తాగు నీటిని సరఫరా చేస్తారు.

నదిలో మృతదేహాలు తేలిన ప్రాంతం పిథౌరీగఢ్​కు చెందినది కాదని తహశీల్దార్ పంకజ్ చందోల తెలిపారు. ఆ మృతదేహాలు ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు జరుపుతున్నామని స్పష్టం చేశారు.

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్, బిహార్​లోని గంగానదిలో కూడా కరోనా వల్ల చనిపోయినవారి మృతదేహాలు బయటపడ్డాయి. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.

ఇదీ చదవండి:whatsapp: వినియోగదారులకు కేంద్ర మంత్రి భరోసా

ABOUT THE AUTHOR

...view details