తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్​లో ట్విస్ట్.. అప్రూవర్​గా మారిన శరత్‌చంద్రారెడ్డి - లిక్కర్ స్కామ్​లో అప్రూవర్‌గా శరత్‌చంద్రారెడ్డి

Delhi Liquor Scam
Delhi Liquor Scam

By

Published : Jun 1, 2023, 12:35 PM IST

Updated : Jun 1, 2023, 2:14 PM IST

12:29 June 01

దిల్లీ లిక్కర్ స్కామ్​లో అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి

Delhi Liquor Policy : దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకమైన వ్యక్తి, సౌత్‌గ్రూప్‌లో ముఖ్య సభ్యుడైన శరత్‌చంద్రారెడ్డి తాను అప్రూవర్‌గా మారుతున్నట్లు.. అందుకు అనుమతి ఇవ్వాలంటూ దిల్లీ రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఇటీవల ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అనుమతులు మంజూరు చేయటంతో పాటు దానికి సంబంధించిన తదుపరి కార్యాచరణ ముందుకు తీసుకువెళ్లేలా ఈడీకి నోటీసులు జారీ చేసింది.

ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు ముడుపులు అందాయని.. వీటిలో రూ.30 కోట్లు హైదరాబాద్‌ నుంచి హవాలా మార్గంలో దిల్లీకి చేరాయని, మిగతా రూ.70 కోట్లు దిల్లీలోనే ఏర్పాటు చేసుకున్నట్లు.. దీంతో పాటు దిల్లీ మద్యం విధానం రూపకల్పనలో శరత్‌ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఇప్పటికే సీబీఐ, ఈడీలు తెలిపాయి. శరత్‌ చంద్రారెడ్డిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సమయంలోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అనేక కీలకమైన విషయాలను ప్రస్తావించింది. నిబంధనలను పక్కనబెట్టి సౌత్‌గ్రూప్‌గా ఏర్పడి, ప్రధానమైన ప్రాంతాల్లో హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్‌ను దక్కించుకున్నట్లుగా ఈడీ ఆరోపించింది. అదే సమయంలో సీబీఐ సైతం విధాన రూపకల్పనలోనే అనేక మార్పులు చేర్పులు చేసినట్లు, హైదరాబాద్‌, దిల్లీలో జరిగిన సమావేశాలతో పాటుకేజ్రీవాల్‌ నివాసంలో జరిగిన భేటీల్లో వీటిపై కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు.. వీటన్నింటిలోనూ శరత్‌ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు సంస్థలు ప్రస్తావించాయి.

Sharath chandra reddy becomes approver : ఈ అంశాలతో పాటు శరత్‌ చంద్రారెడ్డి భార్య కనికా టెక్రివాల్‌ నడిపిస్తున్న ఓ విమానయాన సంస్థకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు డీజీసీఏ, ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి సేకరించారు. ఈ వివరాలను క్రోడీకరించి, శరత్‌ చంద్రారెడ్డిని వారం పాటు ప్రశ్నించిన అధికారులు.. నవంబర్‌ 11న అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తదుపరి కోర్టులో హాజరుపర్చగా.. తిరిగి ఈడీ తమ అదుపులోకి తీసుకుని శరత్‌ చంద్రారెడ్డిని వారం, పది రోజుల పాటు ప్రశ్నించింది. అనంతరం, ఆయనను జైలుకు పంపించారు. జైలుకు పంపించిన రెండ్నెళ్ల తర్వాత తమ బంధువు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బెయిల్‌ మంజూరు చేయాలని శరత్‌చంద్రారెడ్డి కోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ గడువు పూర్తికావస్తున్న తరుణంలోనే తన భార్య ఆరోగ్యం బాగాలేదని.. అందుకు అనుగుణంగా బెయిల్‌ ఇవ్వాలని శరత్‌చంద్రారెడ్డి కోరగా.. వీటిని పరిగణనలోకి తీసుకుని రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోన్న ఈడీ..: ఈ నెల 8న దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన శరత్‌ చంద్రారెడ్డి.. తన ఆరోగ్యం బాగాలేదని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తాము ఆరోగ్య కారణాల రీత్యా మాత్రమే బెయిల్‌ మంజూరు చేస్తున్నామని... కోర్టుకు విధించిన షరతులకు లోబడే వ్యవహరించాలని వెల్లడించింది. మే 8 తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో శరత్‌చంద్రారెడ్డి రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూనే.. ఈడీ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ పూర్తి చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది.

ఇవీ చూడండి..

Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్​ స్కామ్.. ఈడీ అనుబంధ ఛార్జీషీట్లపై ఈనెల 10న విచారణ

3 రోజుల్లో 29 గంటల పాటు సాగిన కవిత ఈడీ విచారణ..

Last Updated : Jun 1, 2023, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details