మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలో పల్స్ పోలియో పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది. ఘటాంజి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పిల్లలకు పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ వేసినట్లు తేలింది. ప్రస్తుతం వారు.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు.
పోలియో చుక్కలని.. శానిటైజర్ వేశారు - dose of polio in Yavatmal
పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో జరిగిన నిర్లక్ష్యానికి 12 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. పోలియో చుక్కలు అనుకొని.. చిన్నారులకు శానిటైజర్ వేశారు సిబ్బంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరగ్గా.. తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
![పోలియో చుక్కలని.. శానిటైజర్ వేశారు Sanitizer administered as a dose of polio in Yavatmal of Maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10461468-669-10461468-1612181460196.jpg)
పోలియో చుక్కలని.. 12 మంది పిల్లలకు శానిటైజర్
ఆ పిల్లలు తొలుత వాంతులు చేసుకోవడం వల్ల చికిత్స కోసం రాత్రికి రాత్రే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఎం.దేవేందర్ సింగ్ ఆసుపత్రిని సందర్శించారు. ఘటనపై ఆరా తీశారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి:'2021లో సాధారణ స్థాయిలోనే నైరుతి రుతుపనాలు!