తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2021, 3:03 PM IST

ETV Bharat / bharat

దాడులు చేయమని సంఘ్ నేర్పుతోంది: రాహుల్

దాడులు చేయటం మాత్రమే సంఘ్​ నేర్పిస్తోందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ విమర్శించారు. కానీ అహింస, సత్యాగ్రహం ద్వారా రైతులు ధైర్యంగా ఉంటారని పేర్కొన్నారు. నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు తాము ఐక్యంగా పోరాడతామని చెప్పారు.

Rahul gandhi
'​సంఘ్ శిక్షణతోనే ఈ దాడులు'

సంఘ్​ను రైతులతో కలిసి ఎదుర్కొంటామని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు వెనకడుగు వేయబోమని చెప్పారు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్​ టికాయిత్ కారుపై రాళ్ల దాడి నేపథ్యంలో రాహుల్​ ట్విట్టర్​ వేదికగా ఈ మేరకు పేర్కొన్నారు.

టికాయిత్​ కారుపై దాడి కేసులో ఏబీవీపీ(భాజపా విద్యార్థి విభాగం)కి చెందిన​ ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనక భాజపానే ఉందని బీకేయూ ఆరోపిస్తోంది.

"సంఘ్​.. వారికి దాడులు చేయడం నేర్పించింది. అహింస, సత్యాగ్రహం.. రైతులకు ధైర్యంగా ఉండటం నేర్పింది. వ్యవసాయ వ్యతిరేక, దేశ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించేంతవరకు మేమంతా కలిసి పోరాడతాం."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వందలాది మంది రైతులు.. దిల్లీ సరిహద్దులో గతేడాది నవంబర్​​ నుంచి నిరసిస్తున్నారు.

ఇదీ చూడండి:మహంత శకం ముగిసినట్లేనా?

ABOUT THE AUTHOR

...view details