తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మన ప్లాన్​ ఇది కాదు కదా, ఆజాద్​ రాజీనామాపై జీ23 నేతల రియాక్షన్ - కాంగ్రెస్​ నేత ఆనంద్​ శర్మ

కాంగ్రెస్​ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామాపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు జీ23 నేతలైన ఆనంద్ శర్మ, సందీప్ దీక్షిత్. ఆయన ఇలా చేస్తారని ఊహించలేదని అన్నారు. ఆజాద్ రాజీనామాను వెన్నుపోటుగా అభివర్ణించారు దీక్షిత్.

azad sandeep anand
azad sandeep anand

By

Published : Aug 26, 2022, 6:36 PM IST

కాంగ్రెస్ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​ రాజీనామాపై జీ23 నేతలైన సందీప్​ దీక్షిత్​, ఆనంద్​ శర్మ స్పందించారు. ఆయన ఇలా చేస్తారని అసలు ఊహించలేదని అన్నారు. జీ23ని బలోపేతం చేసింది ఇందుకోసం కాదని, ఇలా చేయడం వల్ల పార్టీ ఇంకా బలహీన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వెన్నుపోటుగా అభివర్ణించిన దీక్షిత్
ఆజాద్​ రాజీనామాపై కాంగ్రెస్​ నేత సందీప్​ దీక్షిత్​ అసహనం వ్యక్తం చేశారు. రాజీనామా విషయం తెలిసిన మరుక్షణమే సందీప్ ఆజాద్​ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు.​ "మీ రాజీనామా లేఖ చదివినప్పుడు నాకు మీరు వెన్నుపోటు పొడిచిన భావం కలుగుతోంది" అని అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్​లో కీలక బాధ్యతలను చేపట్టిన ఆజాద్​ అంటే తనకు ఎంతో అభిమానం ఉండేదని చెప్పారు దీక్షిత్. ఆయన జీ23 ప్రతిపాదన సమయంలో అధిష్ఠానానికి రాయాల్సిన లేఖను తెచ్చినప్పుడు కూడా మనస్ఫూర్తిగా సంతకం చేశానని వెల్లడించారు.

"అధిష్ఠానానికి మనం రాసిన లేఖను మీరు విస్మరించారా? మనలో కొందరు ఆ లేఖను ఒక మంచి మార్పుకోసం ప్రతిపాదించారు. మరికొందరు ఆ లేఖలోని మాటలకు మద్దతిచ్చారు. మనం అప్పట్లో సంస్కరణలకు తెరలేపాలనుకున్నామే కానీ ఇలా తిరుగుబాటు కోసం కాదు" అని సందీప్​ లేఖలో పేర్కొన్నారు.

ఇదే విషయంపై మరో కాంగ్రెస్​ సీనియర్ ఆనంద్​ శర్మ​​ స్పందించారు. ఈ కీలక పరిణామం కాంగ్రెస్​ నేతలందరినీ బాధిస్తోందని ఆయన అన్నారు. ఆజాద్​ ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేదని చెప్పారు. అధిష్ఠానం ఒకసారైనా ఆత్మవిమర్శ చేసుకుంటుందని తాము భావించినా, దురదృష్టవశాత్తు అది జరగలేదని ఆనంద్​ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఆ విషయంలో బాధగా ఉందన్న జస్టిస్ రమణ, రిటైర్మెంట్​ రోజున కీలక వ్యాఖ్యలు

ఒక చేతిలో కుమారుడు, మరో చేత్తో రిక్షా సవారీ, భార్య ప్రేమ కారణంగా భర్తకు కష్టాలు

ABOUT THE AUTHOR

...view details