తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంటి వద్దే దహన సంస్కారాలు.. విద్యుత్​, గ్యాస్​తో నడిచేలా సంచార శ్మశానం ఏర్పాటు - star chair company kerala

దహన సంస్కారాలు చేసేందుకు గ్రామస్థులు పడుతున్న ఇబ్బందిని చూసిన ఓ సహకార సంస్థ వినూత్నంగా ఆలోచించింది. వారి కోసం ఓ సంచార శ్మశానాన్ని ఏర్పాటు చేసింది. దీంతో వ్యక్తి చనిపోయిన ఇంటి వద్దే దహన సంస్కారాలు చేయొచ్చు.

Sanchara Smashanam  machine in Karnataka
Sanchara Smashanam machine in Karnataka

By

Published : Jan 22, 2023, 11:00 AM IST

ఇంటి వద్దే దహన సంస్కారాలు.. సంచార శ్మశానం ఏర్పాటు చేసిన సహకార సంస్థ

దహన సంస్కారాలకు శ్మశానం లేక ఇబ్బంది పడ్డారు ఆ గ్రామస్థులు. అధికారులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం వల్ల విసిగిపోయారు. గ్రామస్థుల ఇబ్బందులను చూసిన ఓ సహకార సంఘం వినూత్నంగా ఆలోచింది. దహన సంస్కారాలు నిర్వహించేందుకు సంచార శ్మశానాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడీ క్రిమేషన్​ మెషీన్​ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో జరిగింది.

బిందూర్​ నియోజకవర్గం జడ్కల్​ గ్రామ పంచాయతీ పరిధిలోని జడ్కల్, ముదురు గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు. ఈ గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. శ్మశానాలకు స్థలం లేకపోవడం వల్ల కుండాపుర్​ అనే గ్రామానికి వెళ్లి దహన సంస్కారాలు చేయాల్సి వచ్చేది. 2021లో ఓ 50 ఏళ్ల వ్యక్తి చనిపోతే తమ ఇంటి పెరట్లోనే దహన సంస్కారాలు చేయాల్సి దుస్థితి ఏర్పడింది. దాని వల్ల పక్కనే ఉన్న కొబ్బరి తోటకు మంటలు అంటుకున్నాయి.

తమ గ్రామంలో శ్మశానం నిర్మించాలని దశాబ్దాలుగా చేస్తున్న డిమాండ్​ను అధికారులు పెడచెవిన పెట్టారు. అధికారుల తీరుతో గ్రామస్థులు విసుగెత్తిపోయారు. ఆ గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు ఓ వ్యవసాయ సహకారం సంఘం స్పందించింది. వినూత్నంగా ఆలోచించి ఆ గ్రామంలో ఓ సంచార శ్మశానాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి మెషీన్​ కర్ణాటకలో ఇదే మొదటిదని సహకార సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రజల డిమాండ్​కు అనుగుణంగా ఈ పరికరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ మెషీన్​కు అయిన ఖర్చులు సహకార సంఘం ఫండ్​ నుంచి వెచ్చించారు. దీంతో పాటు మెషీన్​ను తరలించేందుకు ట్రాన్స్​పోర్టు ఖర్చు, దహన సంస్కారాలు చేసేందుకు గ్యాస్​ లేదా విద్యుత్​ ఖర్చు కూడా సహకారం సంఘమే భరిస్తుంది. ​

సంచార శ్మశానం

సంచార శ్మశానం.. పర్యావరణ హితం..
పర్యావరణం హితమైన ఈ మెషీన్ దాదాపు 7 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు ఉంటుంది. గ్యాస్​, విద్యుత్​తో పనిచేస్తుంది. విద్యుత్​ లేనప్పుడు గ్యాస్​తో కూడా నడుస్తోంది. మృతదేహాన్ని మెషీన్​ చాంబర్​లో ఉంచి కర్పూరంతో నిప్పు అంటించాలి. టాప్​ మూసేసి గ్యాస్​ కనెక్ట్​ చేయాలి. కొద్ది నిమిషాల్లో దహనం పూర్తి అయిపోతుంది. గ్యాస్​, విద్యుత్​తో పనిచేస్తుంది కాబట్టి వాయు కాలుష్యం కూడా ఉండదు.

సంచార శ్మశానం
సంచార శ్మశానం

ఒక్కసారి దహనం చేయడానికి 10 కిలోల గ్యాస్​, 100 గ్రాముల కర్పూరం అవసరమవుతుంది. ఈ మెషీన్ తయారు చేయడానికి రూ. 5.80 లక్షలు ఖర్చు అయినట్లు నిర్వాహకులు తెలిపారు. దీన్ని కేరళకు చెందిన స్టార్​ ఛైర్​ కంపెనీ తయారు చేసింది. "ఈ సంచార శ్మశానాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చు. కొంత మంది వారి ఇంటి వద్ద దహన సంస్కారాలు నిర్వహించాలనుకుంటారు. అలాంటప్పుడు ఈ మెషీన్​ను సులభంగా చనిపోయిన వ్యక్తి ఇంటి వద్ద తీసుకెళ్లొచ్చు" అని ముదురు వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు విజయ శాస్త్రి తెలిపారు.

సంచార శ్మశానం

ABOUT THE AUTHOR

...view details