Samruddhi Expressway Accident :దైవ దర్శనాలకు వెళ్లి వస్తూ వేర్వేరు ఘటనల్లో 20 మంది మరణించారు. మహారాష్ట్రలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రావెలర్ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో నాలుగు నెలల చిన్నారి సహా 12 మంది అక్కడిక్కడే మృతిచెందారు. మరోవైపు తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో 8 మంది యాత్రికులు మరణించారు.
గుడికి వెళ్లి వస్తుండగా ప్రమాదం..
మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే పై ట్రావెలర్ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో నాలుగు నెలల చిన్నారి సహా 12 మంది అక్కడిక్కడే మృతిచెందారు. వీరంతా సైలాని బాబా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై ఉన్న జంబార్ టోల్‌బూత్ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
Maharashtra Road Accident : నాశిక్ జిల్లాలోని ఇందిరానగర్‌కు చెందిన యాత్రికులు బుల్దానాలోని సైలానీ బాబా దర్శనానికి వెళ్లారు. శనివారం దర్శనం చేసుకున్నాక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మరోవైపు శనివారం అర్ధరాత్రి సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై ఉన్న జంబూర్ టోల్‌బూత్ సమీపంలో ఆర్టీఓ పలు వాహానాలను నిలిపివేశారు. ఈ క్రమంలోనే యాత్రికులతో వస్తున్న ట్రావెలర్ బస్.. ట్రక్కును వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి, డ్రైవర్ సహా బస్సులోని 12 మంది అక్కడిక్కడే మరణించారు. ప్రమాద శబ్దాలు విన్న స్థానికులు.. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఘాటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.