తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డీఆర్​డీఓకు కొత్త ఛైర్మన్, సతీశ్ రెడ్డికి కేంద్రంలో కీలక బాధ్యతలు - DRDO NEW CHAIRMAN SAMIR V KAMAT

డీఆర్​డీఓ కొత్త ఛైర్మన్​గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ కామత్ నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్​ సతీశ్​ రెడ్డిని రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమించింది కేంద్ర ప్రభుత్వం.

DRDO Chairman
DRDO Chairman

By

Published : Aug 25, 2022, 3:02 PM IST

Updated : Aug 25, 2022, 4:03 PM IST

DRDO new chairman 2022 : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ- డీఆర్​డీఓ కొత్త ఛైర్మన్​గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులైన ఆయన.. డీఆర్​డీఓ ఛైర్మన్​గానూ వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జి. సతీశ్​ రెడ్డి రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు.
డీఆర్‌డీఓలో నేవల్ సిస్టమ్స్ అండ్​ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు కామత్. కామత్‌కు అరవై ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారని డీఆర్​డీఓ వెల్లడించింది.

దేశంలోని అగ్రశ్రేణి రక్షణ శాస్త్రవేత్తగా డాక్టర్ సతీష్​ పేరొందిన వ్యక్తి. అగ్ని, పృథ్వీ, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థల కోసం నావిగేషన్, ఏవియానిక్స్ డిజైన్‌ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 2018లో సతీశ్​ రెడ్డి డీఆర్​డీఓ ఛైర్మన్​గా నియమితులయ్యారు. 2020లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. ఇప్పుడు ఆ గడువు పూర్తవగా.. రక్షణ మంత్రికి సలహాదారుగా నియమించింది.
ఇదీ చదవండి:

Last Updated : Aug 25, 2022, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details