తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేద ప్రజల కోసం ఒక్క రూపాయికే వైద్యం - ఒడిశాలో ఒక్క రూపాయికే వైద్యం

ఒడిశాలోని సంబల్​పుర్​ జిల్లాలో ఆయనో డాక్టర్​. నిరంతర సేవాతత్పరుడు. పేద ప్రజల కోసం పాటు పడడం అతని కల. పేద ప్రజలు వైద్యం కోసం పడే పాట్లు అతన్నిబాధించాయి. ఆయన సతీమణి తోడై రాగా..తనే ఓ క్లినిక్​ని స్థాపించాడు. ఒక్కరూపాయికే వైద్యం అందిస్తున్నాడు.

sambalpur-doctor-started-one-rupee-clinic-in-odisha
అక్కడ పేద ప్రజల కోసం ఒక్క రూపాయికే వైద్యం

By

Published : Feb 14, 2021, 3:12 PM IST

ఒడిశాలోని సంబల్​పుర్​ జిల్లాలో ఓ డాక్టర్​ పేద ప్రజల పాలిట దైవమై నిలిస్తున్నాడు. ఒక్క రూపాయికే వైద్యం అందించడానికి క్లినిక్​ను స్థాపించాడు. నిరాశ్రయులకు, దివ్యాంగులకు, వృద్ధులకు ఆపన్నహస్తం అందిస్తున్నాడు.

ఒక్క రూపాయికే వైద్యం అందిస్తున్న డాక్టర్​

చిన్ననాటి కల..

శంకర్​ రామ్​ చండాని..జిల్లాలోని బుర్లా పట్టణంలో ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా పనిచేస్తున్నాడు. చిన్ననాటి నుంచే పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిచాలనే కల ఉండేదతనికి. కానీ ఆయన పనిచేసే ఉద్యోగ స్థాయిలో ప్రైవేట్​గా క్లినిక్​ నడపడానికి అనుమతి లేదు. ఇన్నిరోజుల తర్వాత అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా పదోన్నతి పొందడంతో తన కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. పేద ప్రజలకు ఆపన్న హస్తం అందించాలనుకున్నాడు. తన ఉద్యోగం అయిపోయిన తర్వాత ఖాళీ సమయాల్లో ఉచిత వైద్యం అందించాలనుకున్నాడు. బుర్లా పట్టణంలో కచ్చా మార్కెట్​ ప్రాంతంలో అద్దె భవనంలో క్లినిక్​ను స్థాపించాడు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య, సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య వైద్యం అందిస్తున్నాడు.

క్లినిక్​ ప్రారంభోత్సవ కార్యక్రమం

నర్సింగ్ హోమ్​ స్థాపించాలని నా తండ్రి నాకు చెప్పారు. కానీ దానికి చాలా డబ్బులు అవసరమవుతాయి. ఒక్క రూపాయిలో నర్సింగ్​ హోమ్​ను నిర్వహించలేము. అందుకే దీనిని స్థాపించాను. నేను పనిచేసే ఆసుపత్రికి వందల సంఖ్యలో జనం 'క్యూ' కడతారు. దివ్యాంగులు, వృద్ధులు గంటల తరబడి నిల్చుంటారు. కానీ నా క్లినిక్​లో ఆ అవసరం లేదు. ఒక్క రూపాయితో వెంటనే సంప్రదించవచ్చు.

-శంకర్​ రామ్​ చండాని

ఒక్క రూపాయికే..

శంకర్​ చండాని..తన క్లినిక్​లో ఒక్క రూపాయికే వైద్యం అందిస్తున్నాడు. ఈ ఒక్క రూపాయి మాత్రం ఎందుకని అడగగా.. చికిత్స చేయించుకునేవారు సైతం అత్మన్యూనతా భావానికి లోనుకాకుండా ఉంటుందని అంటున్నాడు. రోగులు.. తాము కూడా డబ్బులు ఇచ్చే వైద్యం చేయించుకున్నామనే భావించాలని ఇలా చేశానంటున్నాడు. నిరాశ్రయులైన వ్యక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు వైద్యం అందిస్తానంటున్నాడు. బలవంతుల కోసం కాదు బలహీనుల కోసం పనిచేస్తానంటున్నాడు.

చికిత్స కోసం వేచి ఉన్న పేద ప్రజలు

సేవాతత్పరుడు..

శంకర్​ చండాని గొప్ప సేవాతత్పరుడు. గతంలోనూ తన సేవాగుణంతో అందరికీ సుపరిచితమే. కుష్ఠు వ్యాధి సోకిన రోగిని చేతులతో ఎత్తుకుని తన ఇంటికి తీసుకువెళ్లి ఆశ్రయం కల్పించాడు. కరోనా వైరస్​ సమయంలోనూ ఏ మాత్రం భయపడకుండా వైరస్​ సోకిన వ్యక్తిని తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకువచ్చాడు. తన ఉద్యోగ సమయం అయిపోయిన తర్వాత కూడా రోగులకు చికిత్స చేశాడు.

వృద్ధ మహిళకు వైద్యం చేస్తున్న డాక్టర్​

సతీమణి తోడై..

శంకర్​ చండాని భార్య సిఖా రామ్​ చండాని. ఈమె దంత వైద్య నిపుణురాలు. నిరంతరం భర్తకు తోడై నిలుస్తుంది. అతను చేసే సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటుంది. క్లినిక్​ స్థాపనలో శంకర్ చండానికి అండగా నిలిచింది.

ఇదీ చదవండి:48 అడుగుల కేక్​తో బేకరీ 'రామ సందేశం'

ABOUT THE AUTHOR

...view details