ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాల కారణంగా.. టెస్టు చేయించుకుంటే పాజిటివ్‌గా తేలిందని ట్విట్టర్లో తెలిపారు. వర్చువల్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో కొందరు అధికారులకు మంగళవారం కరోనా సోకినట్లు తేలగా.. సీఎం ఐసోలేషన్లోకి వెళ్లారు.
అఖిలేశ్‌కు..
యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.
" నాకు కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను సంప్రదించినవారు కరోనా పరీక్షలు చేయించుకోండి."