తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ ఎన్నికల బరిలో అఖిలేశ్​.. ఆ స్థానం నుంచే పోటీ​ - అఖిలేశ్​ యావద్​ వార్తలు

Akhilesh Yadav: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్​ యాదవ్​ పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు సమాజ్​వాధీ పార్టీ అధికార ప్రతినిధి ఆశుతోష్​ వర్మ. మెయిన్​పురిలోని కర్హాల్​ స్థానం నుంచి బరిలో నిలుస్తారని పేర్కొన్నారు. ​

Samajwadi Party chief Akhilesh Yadav
అఖిలేశ్​ యాదవ్​

By

Published : Jan 20, 2022, 5:38 PM IST

Updated : Jan 20, 2022, 6:40 PM IST

Akhilesh Yadav: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​ పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్ వర్మ తెలిపారు. పార్టీకి మంచి పట్టు ఉన్న మెయిన్​​పురిలోని కర్హాల్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బారిలో నిలుస్తున్నట్లు చెప్పారు.

" సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యావద్​ మెయిన్​పురిలోని కర్హాల్​ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. "

- ఆశుతోష్​​ వర్మ, ఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి.

ప్రస్తుతం అజామ్​గఢ్​ లోక్​సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటంపై బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన తర్వాత పోటీ చేయటంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తాజాగా.. ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది.

మెయిన్​పురి పార్లమెంట్​ నియోజకవర్గానికి సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్​ యాదవ్​ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:గోరఖ్​పుర్​లో యోగిపై 'భీమ్​ ఆర్మీ' ఆజాద్ పోటీ

Last Updated : Jan 20, 2022, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details