వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో(Up election 2022) ఉత్తర్ప్రదేశ్లో భాజపాను గద్దె దించి.. అధికారాన్ని చేపట్టే లక్ష్యంతో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే వివిధ పార్టీలతో ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై(Samajwadi party alliance in 2022) సంప్రదింపులు జరుపుతోంది. బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఉత్తర్ప్రదేశ్ ఇన్ఛార్జ్ సంజయ్ సింగ్తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ లఖ్నవూలో సమావేశం అయ్యారు. ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం ఎస్పీతో పొత్తుపై సంప్రదింపులు జరుగుతున్నాయని సంజయ్ సింగ్ వెల్లడించారు.
"ఉత్తర్ప్రదేశ్ను అవినీతి రహితంగా మార్చడానికి, శాంతి భద్రతలను కాలరాసిన ప్రభుత్వాన్ని తొలగించడానికి చేపట్టాల్సిన ఉమ్మడి ఎజెండాపై వ్యూహాత్మక చర్చ జరిగింది. ఎస్పీతో పొత్తుకు సంబంధించి ఇప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. నేడు జరిగిన భేటీలో ఓ అర్థవంతమైన చర్చ జరిగింది. త్వరలోనే దీని గురించి ప్రకటిస్తాం."
- సంజయ్ సింగ్, ఉత్తర్ప్రదేశ్ ఆప్ ఇన్ఛార్జ్.
మరోవైపు.. బుధవారం అప్నా దళ్(కె) పార్టీ అధ్యక్షురాలు కృష్ణ పటేల్తోనూ అఖిలేశ్ యాదవ్(Akhilesh alliance) సమావేశమయ్యారు. తాము ఎస్పీతో కలిసి పోటీ చేయనున్నట్లు ఈ సమావేశం అనంతరం కృష్ణ పటేల్ ప్రకటించారు. సీట్ల పంపకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఒకే తరహా సిద్ధాంతాలు ఉన్న ఇతర పార్టీలను తమతో కలుపుకునేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు.
రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు జయంత్ చౌదరీతో మంగళవారం సమావేశమైన అఖిలేశ్ యాదవ్.. ఆ పార్టీతో పొత్తుకుదుర్చుకున్నారు. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
యూపీపై ఆప్ గురి..