అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాలిబన్లు తమ దేశాన్ని స్వేచ్ఛగా ఉంచాలని కోరుకుంటున్నారని ఉత్తర్‌ప్రదేశ్ సంభాల్ లోక్‌సభ ఎంపీ షఫీకర్ రహమమాన్ బార్క్ వ్యాఖ్యానించారు. దీన్ని భారత స్వాతంత్ర్యోద్యమంతో పోల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
"అఫ్గాన్‌లో రష్యా, అమెరికా అజమాయిషీని తాలిబన్లు అనుమతించటం లేదు. ప్రస్తుతం వారు తమ దేశాన్ని తామే పరిపాలించాలనుకుంటున్నారు. దేశాన్ని బ్రిటిష్ పరిపాలించినప్పుడు.. వారికి వ్యతిరేకంగా దేశమంతా కలిసి పోరాడింది. అదే తరహాలో వారు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. అది వారి అంతర్గత వ్యవహారం. దాంట్లో మన ఎలా జోక్యం చేసుకోగలం?"
-షఫికర్ రహమాన్ బార్క్, ఎంపీ
కాగా, ఈ విషయంపై దేశద్రోహం చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భాజపా నేత రాజేశ్ సింఘాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
యోగి మండిపాటు