తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid Test: ఇక పుక్కిలింతతో కొవిడ్​ నిర్ధరణ!

కరోనా వైరస్​ను సులువుగా గుర్తించే..'సెలైన్‌ గార్గిల్‌ ఆర్‌టీ-పీసీఆర్‌'(Saline Gargle Test) విధానాన్ని అభివృద్ధి చేసిన జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్‌ పరిశోధన సంస్థ (Neeri Covid Test).. దాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం సంబంధిత పరిజ్ఞానాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్‌ఎంఈ)కి అందజేసింది.

Saline gargle test
సెలైన్‌ గార్గిల్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షా విధానం

By

Published : Sep 13, 2021, 8:33 AM IST

పుక్కిలింత ద్వారా కొవిడ్‌-19ను గుర్తించే 'సెలైన్‌ గార్గిల్‌ ఆర్‌టీ-పీసీఆర్‌'(Saline Gargle Test) విధానం ఇక వినియోగంలోకి రాబోతోంది. దీన్ని వాణిజ్య ప్రాతిపదికన అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్‌ పరిశోధన సంస్థ (నీరీ)(Neeri Covid Test) చర్యలు చేపట్టింది. ఇందుకోసం సంబంధిత పరిజ్ఞానాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్‌ఎంఈ)కి అందజేసింది.

ఈ పుక్కిలింత విధానం చాలా సులువైంది. పరీక్ష త్వరగా పూర్తవుతుంది. అప్పటికప్పుడే ఫలితాన్ని ఇస్తుంది. పైగా చౌకైంది కూడా. పరీక్ష నిర్వహణకు పెద్దగా మౌలిక వసతులు అవసరం లేదు. నాగ్‌పుర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'నీరి' సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఎంఎస్‌ఎంఈ శాఖ అర్హులైన, పైవేటు, ప్రభుత్వ సంస్థలకు దీని లైసెన్సును ఇస్తుంది. తద్వారా అవి ఈ పరీక్ష నిర్వహణకు అవసరమైన కిట్‌లను అభివృద్ధి చేస్తాయి. పుక్కిలింత విధానాన్ని పెద్దగా సౌకర్యాలు లేని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అమలు చేయాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details