గల్ఫ్ దేశాల్లో వేతన ఉద్యోగాలు చేస్తున్న ప్రవాస భారతీయుల ఆదాయంపై భారత్‌లో పన్ను మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 2021 ఫైనాన్స్ యాక్ట్ ద్వారా.. సౌదీ, ఒమన్, ఖతర్, యూఏఈల్లో పనిచేసే కార్మికుల విషయంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేదని తెలిపారు. ఆదాయ పన్ను చట్టంలో స్పష్టత కోసమే 'పన్ను చెల్లింపునకు బాధ్యులు' అన్న పదాన్ని ఫైనాన్స్ యాక్ట్ ద్వారా జోడించామని చెప్పారు.
'గల్ఫ్ కార్మికుల ఆదాయంపై పన్ను ఉండబోదు'
గల్ఫ్ దేశాల్లోని ప్రవాసుల ఆదాయంపై భారత్‌లో పన్ను మినహాయింపు కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గల్ఫ్ కార్మికుల ఆదాయంపై అదనపు పన్ను విధిస్తున్నారని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా చేసిన ట్వీట్‌కు సీతారామన్ వివరణ ఇచ్చారు.
'గల్ఫ్ కార్మికుల ఆదాయంపై పన్ను ఉండబోదు'
ఈ మేరకు గల్ఫ్ కార్మికుల ఆదాయంపై అదనపు పన్ను విధిస్తున్నారని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా చేసిన ట్వీట్‌కు సీతారామన్ వివరణ ఇచ్చారు. వాస్తవాలను అర్థం చేసుకోకుండా.. ఓ నిర్ణయానికి రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీరేట్లు యథాతథం'