ఉత్తర్‌ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ట్వీట్ దుమారం రేపింది. జిల్లా పంచాయతీ ఛైర్పర్సన్ పదవులకు జరిగిన ఎన్నికల్లో భాజపా విజయ ఢంకా మోగించినందుకు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపింది సైనా. దీనికి వెంటనే కౌంటర్ ఇచ్చారు రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి. సైనాను 'సర్కారీ షట్లర్' అంటూ ఎద్దేవా చేశారు.
శనివారం రాత్రి సైనా చేసిన ట్వీట్‌పై స్పందించిన చౌదరి.. "ప్రజా తీర్పును అణచివేయడంలో భాజపా నైపుణ్యాన్ని సర్కారీ షట్లర్(సైనా) గుర్తించారు. ఇలాంటి సెలబ్రెటీలు తమ నిర్ణయాలను ప్రభావితం చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి." అని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.