తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డిప్లొమా​, ఐటీఐ అర్హతతో SAILలో 110 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా! - ఇంజినీరింగ్ జాబ్స్

SAIL Engineering Jobs 2023 In Telugu : ఇంజినీరింగ్, ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 110 టెక్నీషియన్​, ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

SAIL Recruitment 2023
SAIL Engineering Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 10:32 AM IST

SAIL Engineering Jobs 2023 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) 110 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్, ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఆపరేటర్​-కమ్- టెక్నీషియన్​ (బాయిలర్ ఆపరేటర్​) - 20 పోస్టులు
  • ఆపరేటర్​-కమ్- టెక్నీషియన్​ (ఎలక్ట్రికల్​ సూపర్​వైజర్) - 10 పోస్టులు
  • అటెండెంట్- కమ్​-టెక్నీషియన్​ (ట్రైనీ) - 80 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 110

విద్యార్హతలు
SAIL Jobs Qualifications :అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్​ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
SAIL Jobs Age Limit : (2023 డిసెంబర్​ 16 నాటికి..)

  • ఆపరేటర్​-కమ్​-టెక్నీషియన్​ (బాయిలర్​ ఆపరేటర్​) వయస్సు 18 ఏళ్లు నుంచి 30 ఏళ్లు మధ్యలో ఉండాలి.
  • ఆపరేటర్క-కమ్​-టెక్నీషియన్​ (ఎలక్ట్రికల్​ సూపర్​వైజర్​) వయస్సు 18 నుంచి 28 ఏళ్లు మధ్యలో ఉండాలి.
  • అటెండెంట్- కమ్​-టెక్నీషియన్​ (ట్రైనీ) వయస్సు 18 ఏళ్లు నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.

అప్లికేషన్ ఫీజు
SAIL Application Fee :

  • ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ పోస్టులకు.. జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్​ఎం, డిపార్ట్​మెంటల్​ అభ్యర్థులు కేవలం రూ.300 చెల్లిస్తే సరిపోతుంది.
  • అటెండెంట్​-కమ్​-టెక్నీషియన్ (ట్రైనీ) పోస్టులకు.. జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు రూ.300 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్​ఎం, డిపార్ట్​మెంటల్​ అభ్యర్థులు కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం
SAIL Job Selection Process :అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
SAIL Job Application Process :

  • అభ్యర్థులు ముందుగా స్టీల్​ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) అధికారిక వెబ్​సైట్​ https://www.sail.co.in/ ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లోని Careers ట్యాబ్​పై క్లిక్ చేసి, ఓపెన్​ చేయాలి.
  • ముందుగా మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన విద్యార్హత పత్రాలను అప్లోడ్ చేయాలి.
  • ఆన్​లైన్​లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఒకసారి అన్ని వివరాలు సరిచూసుకుని, అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
SAIL Job Application Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్ 20
  • దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ : 2023 డిసెంబర్​ 16

డిగ్రీ అర్హతతో ఎస్​బీఐలో 8773 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

డిగ్రీ, డిప్లొమా అర్హతతో AAIలో 185 అప్రెంటీస్​ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details