ఈ నెల 7 నుంచి శిరిడీలో సాయి దర్శనానికి (Shirdi Temple Open) భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు సాయిబాబా దేవాలయ ట్రస్ట్ ప్రకటించింది. కరోనా రెండో వేవ్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ 5న బాబా ఆలయాన్ని మూసివేశారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడం వల్ల కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. భక్తులకు ఆలయ ప్రవేశం (Shirdi Temple Open) కల్పిస్తున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది.
దసరా నవరాత్రుల తొలి రోజు నుంచే భక్తులు సాయిని (Shirdi Temple Open) దర్శించుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. రోజుకు 15 వేల మంది సాయిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. 5 వేల పెయిడ్ పాస్‌లు, 5 వేల ఆన్‌లైన్ పాస్‌లతో పాటు మరో 5 వేల ఆఫ్‌లైన్ పాస్‌లు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.