తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Donation to Shirdi Temple: శిర్డీ సాయిబాబాకు ఏపీ భక్తుడు రూ 23 లక్షల విరాళం

Family from AP donated Rs 23 lakhs to Shirdi temple: ఆషాఢ ఏకాదశి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని సాయి భక్తుల కుటుంబం శిర్డీ సాయిబాబాకు రూ.23 లక్షల విరాళం అందించింది. అక్కడ సంస్థానం సేవా కార్యక్రమాలు.. పేద ప్రజలకు ఉపయెగ పడే విధంగా విరాళం ఇచ్చినట్లు భక్తుడు చక్కా సూర్యనారాయణ తెలిపారు.

Family from AP donated Rs 23 lakhs to Shirdi temple
షిర్డీ సాయిబాబాకు రూ 23 లక్షల విరాళం అందించిన విశాఖ వాసులు

By

Published : Jun 29, 2023, 7:25 PM IST

షిర్డీ సాయిబాబాకు రూ 23 లక్షల విరాళం అందించిన విశాఖ వాసులు

Rs.23 Lakhs donation to Shirdi Sai Baba Temple: ఆషాఢ ఏకాదశి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని సాయి భక్తుల కుటుంబం శిర్డీ సాయిబాబాకు రూ.23 లక్షల విరాళం అందించింది. దేశం నలుమూలల నుంచి సాయి దర్శనం కోసం భక్తులు తరలివస్తుంటారు. శిర్డీకి వచ్చే భక్తులు నగదు రూపంలో లేదా వస్తు రూపంలో విరాళాలు అందజేస్తుంటారు. ఇందులో దక్షిణాది భక్తులు ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన చక్కా సూర్యనారాయణ కుటుంబం ఈరోజు ఆషాఢ ఏకాదశి సందర్భంగా శిర్డీ సాయిబాబాకు 23 లక్షల రూపాయల విరాళం అందించారు.

ఆషాఢ ఏకాదశి సందర్భంగా విశాఖకు చెందిన చక్కా సూర్యనారాయణ అనే సాయి భక్త కుటుంబం ఈరోజు శిర్డీకి వచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం సాయిబాబా మందిర్ ప్రాంతంలోని సంస్థాన్ విరాళాల కార్యాలయానికి రూ.23 లక్షలు విరాళం అందజేశారు. సాయిబాబా సంస్థాన్ ఉచితంగా నిర్వహిస్తున్న శ్రీసాయిబాబా ప్రసాదాలయానికి మొత్తం రూ.23 లక్షలు నగదు రూపంలో అందజేశారని, సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.శివశంకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి శివశంకర్చక్కా కుటుంబీకులను సత్కరించి సాయి విగ్రహం అందజేశారు.

సాయిబాబాతో మాకు మానసిక అనుబంధం ఉందని చక్కా పరివారానికి చెందిన సుంబాయి గాయత్రి నయన తెలిపారు. సాయిబాబా ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయన్నారు. సాయిబాబా మనకు వేల చేతులు ఇస్తున్నారని, అందుకే శిర్డీకి వచ్చే భక్తులతో పాటు ఇక్కడి ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులకు కూడా భోజనం పెడుతున్నామని అన్నారు.

ప్రతిరోజూ యాభై మంది హాదర్ నుండి లక్ష మంది భక్తులు శిర్డీ సాయి ఆలయాన్ని సందర్శిస్తారు, వారిలో ఎక్కువ మంది నగదు లేదా దక్షిణ హుండీలో వేస్తారు. సాయిబాబాకు భక్తులు ఇచ్చే విరాళాల సంఖ్య సగటున రోజుకు కోటి రూపాయలు ఉంటుంది. వేసవి సెలవులు వచ్చిన నెలన్నరలో శిర్డీ ఆలయానికి భక్తులు నలభై ఐదు కోట్ల వరకు కానుకలుగా సమర్పించారు. సాయి భక్తుల నుండి వచ్చిన ఈ విరాళం ద్వారానే సాయి సంస్థాన్ శిర్డీలో భక్తులకు సౌకర్యాలు మరియు సిబ్బందికి జీతాలు అందించడంతో పాటు ఉచిత ఆసుపత్రిని నిర్వహిస్తోంది. దీనితో పాటు సాయి సంస్థానంలోని ప్రసాదాలయంలో ప్రతిరోజూ యాభై వేల మంది భక్తులు ఉచితంగా భోజనం చేస్తారు.

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం నుంచి ఆషాడ ఏకాదశి సందర్భంగా ఇక్కడకు దర్శనానికి వచ్చాను. ఇక్కడ సంస్థానం వారు పెద ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు..చేస్తున్నారు. పేద ప్రజలకు ఉపయెగ పడే విధంగా నా వంతు సాయంగా విరాళం ఇవ్వడం జరిగింది. ఈ విరాళం పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలని ఇచ్చాను కాబట్టి.. ట్రస్టు వారు ఆ విధంగా ఉపయోగిస్తారని కోరుకుంటున్నాను.- సూర్యనారాయణ చక్క, సాయిబాబా భక్తుడు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖకు చెందిన చక్కా సూర్యనారాయణ, ఆయన కుటుంబం ఆషాడ ఏకాదశి సందర్భంగా శిర్డీ సాయిబాబాను దర్శించుకోవడానికి వచ్చారు.. ఇక్కడ మా సంస్థ నడిపిస్తున్న కార్యక్రమాల కోసం ఆయన 23 లక్షల రూపాయల నగదును విరాళంగా అందించారు. ట్రస్ట్​ వారు నడిపిస్తున్న సాయిబాబా ఆసుపత్రిలోని పేదల వైద్యానికి 18 లక్షల రూపాయలు, అలాగే నిత్య అన్నదానానికి 5 లక్షల రూపాయలు అందించారు.. చక్కా సూర్యనారాయణ, ఆయన కుటుంబానికి సాయి బాబా సంస్థానం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.- పి శివశంకర్‌, సాయి సంస్థాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌

ABOUT THE AUTHOR

...view details