తెలంగాణ

telangana

ETV Bharat / bharat

22 ఏళ్ల కల సాకారం.. KBCలో జాక్​పాట్ కొట్టిన భూపేంద్ర - kbc hindi nov 10 promo

సామాన్య కుటుంబానికి ఓ వ్యక్తి.. కౌన్​ బనేగా కరోడ్​పతి షోతో లక్షాధికారి అయ్యాడు. బిగ్​బీ అమితాబ్ బచ్చన్​ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి 50లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఇందుకోసం అతడు దాదాపు 22 ఏళ్లు శ్రమించాడు.

bhupendra chaudary kbc
bhupendra chaudary kbc

By

Published : Nov 9, 2022, 3:30 PM IST

"మీరు నిద్రలో చూసేవి కలలు కాదు.. మిమ్మల్ని నిద్రపోనివ్వకుండే చేసేవే కలలు" అన్న అబ్దుల్​ కలామ్​ మాటలకు అనుగుణంగా మధ్యప్రదేశ్​ సాగర్​లోని ఓ వ్యక్తి తన 22 ఏళ్ల స్వప్నాన్ని కౌన్​ బనేగా కరోడ్​పతి షో ద్వారా సాకారం చేసుకున్నాడు. 16వ ఏట అనుకున్న ఆ లక్ష్యాన్ని తన 38వ ఏట సాధించాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరో తెలుసుకుందామా ?

మధ్యప్రదేశ్​లోని సాగర్​కు చెందిన 38 ఏళ్ల భూపేంద్ర చౌదరికి చిన్నప్పటి నుంచే కేబీసీ షో అంటే ఎంతో ఇష్టం. ఆ షో మీదున్న మక్కువతో ఎన్నో సార్లు అందులో పాల్గొనాలనుకున్నాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. అలా తన 16వ ఏట ప్రారంభించిన ఆ ప్రయత్నాలు ఆఖరికి 38వ ఏట ఫలించాయి.

నవంబర్​ 10న టెలికాస్ట్ కానున్న ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోను చూసినట్లయితే ఇందులో ఆయన దాదాపు రూ.50 లక్షలు గెలిచినట్లు తెలుస్తోంది. గుజరాత్‌లోని దాహోద్‌లో వ్యవసాయ నిపుణుడిగా పని చేస్తున్న భూపేంద్ర హాట్​ సీట్​కు అంత ఈజీగా వెళ్లలేదు. దాదాపు 400 ప్రశ్నలకు సమాధానం చెప్పి టాప్​ 10 కంటెస్టెంట్​గా నిలిచాడు. అలా మరో రౌండ్​కు అర్హత సంపాదించాడు.

హాట్​ సీట్​లో కూర్చునే ముందు ఆడే ఆ గేమ్​ ఆద్యంతం హోరాహోరీగా సాగుతుంది. 'ఫాస్టెస్ట్ ఫింగర్'​ అనే ఈ గేమ్​లో టాప్​ 10 కంటెస్టెంట్స్​ను మూడు జనరల్​ నాలెడ్జ్​ ప్రశ్నలు అడుగుతారు. వాటికి ఎవరైతే సమాధానం చెబుతారో వారినే హాట్​ సీట్​ వరిస్తుంది. చివరకు.. బిగ్​బీ ముందు హాట్​ సీట్​లో కూర్చున్నాడు. దీంతో ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని బిగ్​బీతో పంచుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన కల నేరవేరడం వల్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపిన ఆయన ఇప్పుడు ఈ షో వల్ల తన గ్రామం మరింత పాపులర్​ అవుతుందని హర్షం వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:సైనికుల పటిష్ఠ పహారా.. ప్రశాంతతకు ఆవల.. తుపాకుల గర్జన!

సంజయ్​ రౌత్​కు ఊరట- ఆ కేసులో ఎట్టకేలకు బెయిల్​

ABOUT THE AUTHOR

...view details