తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై ప్రగ్యా ఠాకూర్​ వివాదాస్పద వ్యాఖ్యలు - గో మూత్రం తాగడం, దేవడ్ని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల తనకు ఎప్పటికీ కరోనా సోకబోదన్న ప్రగ్యా సింగ్ ఠాకూర్

భాజపా నాయకురాలు, భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ వివాదాస్పదంగా మాట్లాడారు. ఆవు మూత్రం తాగడం, దేవుడ్ని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల తనకు ఎప్పటికీ కరోనా సోకబోదని అన్నారు.

Sadhvi pragya
భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాగూర్

By

Published : May 17, 2021, 8:14 PM IST

కరోనాపై భాజపా ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్​ మరోసారి వివాదాస్పదంగా మాట్లాడారు. గో మూత్రం తాగడం, దేవుడ్ని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల తనకు ఎప్పటికీ కరోనా సోకబోదని అన్నారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. కరోనా సంక్షోభ సమయంలో ఆమె కనిపించకుండా పోయారని విమర్శించింది.

కరోనాపై వివాదాస్పదంగా మాట్లాడటం ప్రగ్యాకు ఇది కొత్తేం కాదు. వైరస్ మొదటి దశలో కూడా.. ప్రతి ఒక్కరు ఆవును పెంచుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం వల్ల కరోనాను అరికట్టవచ్చని అన్నారు. అయితే.. ప్రగ్యా కార్యాలయంలో అందరికి కరోనా సోకినా.. ఆమె మాత్రం వైరస్ బారిన పడలేదు.

ఇదీ చదవండి:'భారత్​లో టీకా తర్వాత రక్తస్రావం కేసులు తక్కువే!'

ABOUT THE AUTHOR

...view details