తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డబ్బుల కట్టలతో హోటల్​కు వాజే.. వీడియో కలకలం!

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అరెస్టైన పోలీస్​ అధికారి సచిన్ వాజే.. డబ్బుల కట్టలను తన కారులో తీసుకువెళ్లినట్లు ఓ వీడియో ఒకటి బయటకువచ్చింది. ఓ హోటల్లోకి వెళ్లినప్పుడు స్కానర్ల ఫుటేజీలో బ్యాగులో డబ్బుల కట్టలు ఉన్నట్లు కనిపిస్తోంది.

Sachin Waje on CCTV walking into a five star hotel. Accompanied by a bag of money
డబ్బుల కట్టలతో వాజే.. వీడియో కలకలం

By

Published : Mar 25, 2021, 8:07 PM IST

అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసు.. నాటకీయ మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టై, సస్పెండైన పోలీస్​ అధికారి సచిన్​ వాజేకు సంబంధించిన ఓ సీసీటీవీ వీడియో.. కలకలం సృష్టిస్తోంది. ఓ 5 నక్షత్రాల హోటల్లోకి ఆయన తన కారులో డబ్బుల కట్టలను తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. స్కానర్లలో నమోదైన ఫుటేజీలో ఈ విషయం బయటపడింది.

స్కానర్లలో నమోదైన దృశ్యాలు
సీసీటీవీలో సచిన్​ వాజే.. కారు దృశ్యాలు

మరోవైపు.. ఈ కేసులో వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ప్రత్యేక కోర్టు ముందు శుక్రవారం హాజరుపరిచింది. తనకు ఈ కేసుకూ ఏ సంబంధమూ లేదని న్యాయస్థానం ఎదుట సచిన్​ వాజే నివేదించారు. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.

సచిన్​వాజే ఎన్​ఐఏ కస్టడీని కోర్టు ఏప్రిల్​ 3 వరకు పొడిగించింది.

ఇదీ చూడండి:బాంబే హైకోర్టుకు పరమ్​ వీర్​ సింగ్​

ABOUT THE AUTHOR

...view details