తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హిరేన్'​ కేసు: క్రైం బ్రాంచ్​ నుంచి సచిన్​​ తొలగింపు - maharashtra latest news

ముంబయి క్రైం బ్రాంచ్​ నుంచి అసిస్టెంట్​ పోలీస్​ ఇన్​స్పెక్టర్​ సచిన్ వాజేను తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ ప్రకటించారు. మన్​సుఖ్​ హిరేన్​ మృతి కేసులో దర్యాప్తు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో.. ప్రతిపక్షాల డిమాండ్​ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Sachin Vaz will be removed from Crime Branch - Deshmukh
క్రైం బ్రాంచ్​ నుంచి సచిన్​ వాఝే​ తొలగింపు

By

Published : Mar 10, 2021, 1:12 PM IST

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు లభించిన కారు యజమాని మన్​సుఖ్​ హిరేన్​ మృతి కేసుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్​ పోలీస్​ ఇన్​స్పెక్టర్​ సచిన్​ వాజే ను క్రైం బ్రాంచ్​ నుంచి తొలగించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ తెలిపారు. హిరేన్​ భార్య వాంగ్మూలంలో సచిన్ వాజే పేరు ఉన్నందునే అతడ్ని తప్పించినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం కూడా దీనికి కారణమన్నారు.

హిరేన్​ మృతి కేసులో నిష్పాక్షికంగా, పారదర్శకంగా విచారణ జరుపుతామని అనిల్​ దేశ్​ముఖ్ స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు సచిన్ వాజేకు ఇతర శాఖలో బాధ్యతలు కేటాయిస్తామన్నారు.

దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసానికి సమీపంలో ఇటీవల జిలెటిన్‌ స్టిక్స్‌తో ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్నారు. అనంతరం ఆ వాహనం తనదేనని, వారం రోజుల క్రితం అది చోరీకి గురైందని మన్‌సుఖ్‌ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే అదృశ్యమైన ఆయన గతవారం సముద్రపు పాయలో శవమై కనిపించారు. ఈ కేసుపై రాజకీయ దుమారం చెలరేగింది. జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి.

ఇదీ చూడండి:అంబానీ ఇంటి వద్ద బాంబుల కేసులో మరో ట్విస్ట్

ABOUT THE AUTHOR

...view details