తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Sachin Pilot: ఆమె ఆ సచిన్‌తో మాట్లాడారేమో! - రీటా బహుగుణ సచిన్ పైలట్ వివాదం

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలట్ భాజపాలో చేరనున్నారంటూ.. రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలపై ఆయన​ ఘాటుగా స్పందించారు. ఆమెకు నాతో మాట్లాడే ధైర్యం కూడా లేదంటూ మండిపడ్డారు. బహుశా ఆమె సచిన్ తెందూల్కర్‌తో మాట్లాడి ఉండవచ్చని ఎద్దేవా చేశారు.

sachin pilot
సచిన్‌ పైలట్

By

Published : Jun 11, 2021, 11:35 PM IST

సచిన్‌ పైలట్‌ భాజపాలో చేరతారంటూ ఆ పార్టీ నేత రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్‌ స్పందించారు. ఈ విషయంపై తాను సచిన్‌తో మాట్లాడానని రీటా చెప్పగా.. ఆమెకు తనతో మాట్లాడే ధైర్యం లేదని ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..'సచిన్‌తో మాట్లాడానని రీటా బహుగుణ చెప్పారు. ఆమె సచిన్‌ తెందూల్కర్‌తో మాట్లాడి ఉండొచ్చు. నాతో మాట్లాడే ధైర్యం ఆమెకు లేదు' అంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. ఈ క్రమంలో సచిన్ పైలట్ కూడా పార్టీని వీడతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో సచిన్ తిరుగుబావుటా ఎగురవేయగా.. అధిష్ఠానం ఆయన్ను బుజ్జగించింది. దాంతో పార్టీ మార్పుపై వచ్చిన వార్తలు సద్దుమణిగాయి. మళ్లీ జితిన్ ప్రసాద కారణంగా అవి ఊపందుకున్నాయి. 'సచిన్ త్వరలో భాజపాలో చేరతారు. కాంగ్రెస్ ఆయన్ను గౌరవించలేదు' అంటూ బహుగుణ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

ఇవీ చదవండి:పైలట్ తిరిగొచ్చినా యథావిధిగా బలపరీక్ష!

పదవుల కోసం వెంపర్లాడటం లేదు: పైలట్​

ABOUT THE AUTHOR

...view details